AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Movie: ‘హనుమాన్’ నెగిటివ్ ప్రచారంపై డైరెక్టర్ రియాక్షన్.. క్లారిటీ ఇచ్చేసిన ప్రశాంత్ వర్మ..

ఎవ్వరూ ఊహించని విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సంక్రాంతి బరిలో నిలిచిన నాలుగు చిత్రాల్లో అతిపెద్ద విజయాన్ని సాధించింది ఈ మూవీ. ఇందులో యంగ్ హీరో తేజా సజ్జా ప్రధాన పాత్రలో నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, అమృతా అయ్యార్, సముద్రఖని, వినయ్ రాయ్ కీలకపాత్రలలో నటించారు. ఇప్పటికీ థియేటర్లలో ఓ రేంజ్ రెస్పాన్స్‏తో దూసుకుపోతున్న ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూస్ తోపాటు.. నెగిటివ్ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

Hanuman Movie: 'హనుమాన్' నెగిటివ్ ప్రచారంపై డైరెక్టర్ రియాక్షన్.. క్లారిటీ ఇచ్చేసిన ప్రశాంత్ వర్మ..
Prashanth Varma
Rajitha Chanti
|

Updated on: Feb 09, 2024 | 7:03 AM

Share

హనుమాన్ సినిమా.. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. భారతీయ ఇతిహాసాల్లోని సూపర్ హీరో ఆంజనేయుడి పాత్రను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా రూపొందించారని ప్రశంసలు కురిపించారు. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ విజువల్స్ బాగున్నాయంటూ రివ్యూస్ వచ్చాయి. ఎవ్వరూ ఊహించని విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సంక్రాంతి బరిలో నిలిచిన నాలుగు చిత్రాల్లో అతిపెద్ద విజయాన్ని సాధించింది ఈ మూవీ. ఇందులో యంగ్ హీరో తేజా సజ్జా ప్రధాన పాత్రలో నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, అమృతా అయ్యార్, సముద్రఖని, వినయ్ రాయ్ కీలకపాత్రలలో నటించారు. ఇప్పటికీ థియేటర్లలో ఓ రేంజ్ రెస్పాన్స్‏తో దూసుకుపోతున్న ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూస్ తోపాటు.. నెగిటివ్ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో హనుమాన్ సినిమాపై అటు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే వాటిపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తనదైన శైలీలో రియాక్ట్ అయ్యారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు, నిర్మాత నిరంజన్ రెడ్డికి మధ్య రెమ్యునరేషన్ కు సంబంధించిన గొడవలు జరుగుతున్నాయని రూమర్స్ వైరలయ్యాయి. అయితే నెగిటివ్ రివ్యూ్స్ కు ఒక్క ఫోటోతో చెక్ పెట్టారు ప్రశాంత్ వర్మ. తాను, నిర్మాత ఇద్దరూ కలిసి నవ్వుతూ ఫోన్ లో ఏదో చూస్తున్నట్లుగా ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ఇలా నెగిటివిటీని తీసిపడేస్తూ నవ్వుకుంటున్నాం. హనుమాన్ స్పిరిట్ ను కొనసాగిస్తున్నామంటూ ఫోటోను పెట్టి ట్వీట్ చేశాడు. దీంతో దర్శకనిర్మాతల మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చేశాడు.

ఈ చిత్రాన్ని దాదాపు రెండు మూడేళ్లు నిర్మించామని గతంలోనే చిత్రయూనిట్ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా హీరో తేజా సజ్జా ఈ మూవీ కోసం దాదాపు 75 చిత్రాలను రిజెక్ట్ చేశానని అన్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది ఈ మూవీ. మార్చిలో ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వైభవ్ ఔటయ్యాక పాక్ ప్లేయర్ల రచ్చ.. అభిషేక్ ఏం చేశాడంటే?
వైభవ్ ఔటయ్యాక పాక్ ప్లేయర్ల రచ్చ.. అభిషేక్ ఏం చేశాడంటే?
రాత్రిపూట బొప్పాయి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
రాత్రిపూట బొప్పాయి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
మీ దగ్గర రూ.10 లక్షలు ఉన్నాయా? నెలకు రూ.35 వేలు సంపాదించాలంటే ఎలా
మీ దగ్గర రూ.10 లక్షలు ఉన్నాయా? నెలకు రూ.35 వేలు సంపాదించాలంటే ఎలా
హైదరాబాద్‌లో ఉత్సాహభరితంగా నషా ముక్త్ భారత్ సైక్లింగ్ ర్యాలీ
హైదరాబాద్‌లో ఉత్సాహభరితంగా నషా ముక్త్ భారత్ సైక్లింగ్ ర్యాలీ
ఖరీదైన బట్టలు అవసరం లేదు.. ఆఫీసులో హుందాగా కనిపించాలంటే ఇవి చాలు
ఖరీదైన బట్టలు అవసరం లేదు.. ఆఫీసులో హుందాగా కనిపించాలంటే ఇవి చాలు
వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు.. చరిత్రను తిరగరాసిన జంషెడ్ ఆలం
వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు.. చరిత్రను తిరగరాసిన జంషెడ్ ఆలం
కారులో CNG కిట్ పెట్టిస్తున్నారా? ఈ తప్పు చేస్తే పేలుడు ప్రమాదం
కారులో CNG కిట్ పెట్టిస్తున్నారా? ఈ తప్పు చేస్తే పేలుడు ప్రమాదం
ప్రతి రోజూ ఉదయాన్నే 2 స్పూన్లు తింటే చాలు.. 60ల్లోనూ బాడీ ఉక్కులా
ప్రతి రోజూ ఉదయాన్నే 2 స్పూన్లు తింటే చాలు.. 60ల్లోనూ బాడీ ఉక్కులా
రాగి పిండితో కరకరలాడే కట్లెట్స్.. సాయంత్రం టీతో తింటే అదిరిపోద్ది
రాగి పిండితో కరకరలాడే కట్లెట్స్.. సాయంత్రం టీతో తింటే అదిరిపోద్ది
ప్రభుత్వ ఉద్యోగం వచ్చే ఛాన్స్.. వీరికి ఈ వారం పట్టింది బంగారమే
ప్రభుత్వ ఉద్యోగం వచ్చే ఛాన్స్.. వీరికి ఈ వారం పట్టింది బంగారమే