Heroine Gopika: ఏంటీ.. ఈ హీరోయిన్ కూతురు ఇంతందంగా ఉంది.. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ లతిక ఫ్యామిలీని చూశారా.. ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ లవ్ స్టోరీ చిత్రాల్లో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ ఒకటి. అప్పట్లో తెలుగులో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పక్కర్లేదు. మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ది డీసెంట్ హిట్ మూవీ ఇది. ఇప్పటికీ ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో లతిక గుర్తుందా.. ?

Heroine Gopika: ఏంటీ.. ఈ హీరోయిన్ కూతురు ఇంతందంగా ఉంది.. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ లతిక ఫ్యామిలీని చూశారా.. ?
Na Autograph

Updated on: Nov 24, 2025 | 5:12 PM

తెలుగు సినిమా ప్రపంచంలో ఎన్నో ప్రేమకథలు తెరపై సందడి చేశాయి. అప్పట్లో లవ్ స్టోరీ సినిమాలకు యూత్ లో సెపరేట్ క్రేజ్ ఉండేది. అలాంటి వాటిలో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ ఒకటి. రవితేజ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచినా సినిమాలు చాలా ఉన్నప్పటికీ ఈ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో రవితేజ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. లవ్ ఫెయిల్యూర్ ఎమోషనల్ సీన్స్ లో తన నటనతో ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేశారు. ఎస్ గోపాల్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజతోపాటు.. సునీల్, భూమిక సైతం కీలకపాత్రలు పోషించారు. 2004లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. అలాగే ఈ చిత్రంలోని సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ప్రతి యువకుడి జరిగే కథకు దగ్గరగా ఈ సినిమాను రూపొందించడంతో జనాలకు మరింత చేరువయ్యింది.

ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

ఈ సినిమాలో భూమిక, గోపిక, కనికా ముగ్గురు హీరోయిన్స్ గా నటించారు. కానీ ఎక్కువగా రవితేజ, గోపిక కెమిస్ట్రీ జనాలకు మరింత దగ్గరయ్యింది. ఇందులో లతిక అనే మలయాళీ అమ్మాయి పాత్రలో సహజంగా నటించి మెప్పించారు గోపిక. అందం, అభినయంతో స్క్రీన్ పై మరింత అద్భుతంగా కనిపించారు. ఈ సినిమాతో అప్పట్లో కుర్రాళ్ల హృదయాలను గెలుచుకుంది గోపిక. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. యువసేన సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..

గోపిక అసలు పేరు గ్లోరీ ఆంటో. గోపిక మలయాళంలో పలు సినిమాల్లో నటించారు. తెలుగులో చివరిసారిగా వీడు మామూలోడు కాదు అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఎక్కడ కనిపించలేదు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 2008 జూలై 17న ఉత్తర ఐర్లాండ్‌లో పనిచేస్తున్న డాక్టర్ అజిలేష్ చాకోను వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.ప్రస్తుతం వీరి కుటుంబం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో స్థిరపడ్డారు. సోషల్ మీడియాకు గోపిక దూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమె కుటుంబానికి సంబంధించిన ఫోటోస్ వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?

Gopika Family

ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..