మాస్ మాహారాజా రవితేజ (Raviteja) ప్రస్తుతం నటిస్తోన్న సినిమా ఖిలాడి (Khiladi). ఈ చిత్రానికి రమేశ్ వర్మ దర్శకత్వం వహించగా.. రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రాక్ సినిమాతర్వాత రవితేజ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. నిర్మాత కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఖిలాడి రిలీజ్ డేట్ దగ్గరపడుతుండంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఖిలాడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుక సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఖిలాడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను టీవీ 9 లైవ్‌లో చూసేయ్యండి.
ఇటీవల విడుదలైన ఖిలాడి ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నారు. ఇందులో అనసూయ, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, తమిళ్ స్టార్ హీరో అర్జున్ కీలకపాత్రలలో నటించారు.
Isha Chawla: ప్రేమకావాలి అంటూ ఒకసారి ఎంట్రీ.. డబల్ ధమాకాతో రీఎంట్రీ..’ఇషాచావ్లా’ న్యూ ఫొటోస్..
Meenakshi Chaudhary: అలాంటి సీన్స్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటున్న బ్యూటీ..