Raviteja Khiladi: ఖిలాడి నుంచి అదిరిపోయే సర్‏ప్రైజ్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మాస్ మహారాజా..

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని శరవేగంగా

Raviteja Khiladi: ఖిలాడి నుంచి అదిరిపోయే సర్‏ప్రైజ్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మాస్ మహారాజా..
Raviteja

Updated on: Nov 11, 2021 | 11:31 AM

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. క్రాక్ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చిన మాస్ మాహారాజా.. వీలైనంత తొందరగా తన నెక్ట్స్ మూవీస్‏ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక రవితేజ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ఖిలాడీ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. డైరెక్టర్ రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి. మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో, ముఖేశ్ రుషి .. సచిన్ కేద్కర్ .. రావు రమేశ్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఇక ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ.. ఖిలాడీ నుంచి ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.ఇక దీపావళి కానుకగా విడుదలైన టైటిల్ సాంగ్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఖిలాడి టైటిల్ సాంగ్ మంచి మాస్ బీట్స్ తో సాగిన ఈ పాట సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీలో ప్రత్యేకమైన పాత్రలో అనసూయ మెరవనుంది.

ట్వీట్..

Also Read: Nagineedu: మర్యాద రామన్న సినిమా నాకు మైనస్ అయ్యింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన నాగినీడు..

Hyper Aadi: తనపై దాడి చేశారనే వార్తలపై స్పందించిన హైపర్ ఆది.. వారికి స్వయంగా డబ్బులిస్తానంటూ..

Megastar Chiranjeevi: గ్రాండ్‏గా ప్రారంభమైన భోళా శంకర్.. చిరంజీవి సినిమా పూజా కార్యక్రమాలు లైవ్.. 

Bigg Boss 5 Telugu: కేక్ తినేసిన సన్నీ.. రచ్చ చేసిన ఆనీ మాస్టర్.. ఇదేక్కడి గోల..