Hanuman Movie: ‘హనుమాన్’ మూవీలో మాస్ మహారాజా.. సినిమా మొత్తం రవితేజ సందడి.. అప్డేట్ అదిరిపోయింది..

హనుమంతుడిని ఆధారంగా చేసుకుని ఈ సోషియో ఫాంటసీ సినిమాను రూపొందిస్తున్నారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాతో అటు ప్రశాంత్ వర్మ... ఇటు తేజా సజ్జా ఇద్దరూ పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. గతంలో విడుదలైన టీజర్‏తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ఇందులోని విజువల్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ గురించి చెప్పక్కర్లేదు.

Hanuman Movie: హనుమాన్ మూవీలో మాస్ మహారాజా.. సినిమా మొత్తం రవితేజ సందడి.. అప్డేట్ అదిరిపోయింది..
Raviteja, Hanuman

Updated on: Dec 28, 2023 | 8:46 AM

యంగ్ హీరో తేజా సజ్జా ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా హనుమాన్. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తోన్న సినిమా ఇది. హనుమంతుడిని ఆధారంగా చేసుకుని ఈ సోషియో ఫాంటసీ సినిమాను రూపొందిస్తున్నారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాతో అటు ప్రశాంత్ వర్మ… ఇటు తేజా సజ్జా ఇద్దరూ పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. గతంలో విడుదలైన టీజర్‏తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ఇందులోని విజువల్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ గురించి చెప్పక్కర్లేదు. మరోసారి ఈ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండడంతో ఈసినిమా నుంచి బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే హనుమాన్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమాలో మాస్ మాహారాజా రవితేజ కూడా భాగమవుతున్నారు. కనిపించబోతున్నారని కాదు.. వినిపించబోతున్నారు. ఈ సినిమాలో వానరం పాత్ర ఉంటుంది. ఆ వానరం పేరు ‘కోటి’. సినిమా మొత్తం వానరం పాత్ర ఉంటుంది. ఈ పాత్రకు రవితేజ వాయిస్ అందించారు. కోటి పాత్రకు మాస్ మహారాజా డబ్బింగ్ చెప్పారు. అంటే హనుమాన్ సినిమా మొత్తం రవితేజ వాయిస్ వినిపిస్తుంది. సాధారంగా వానరం అంటే ఎలా ఉంటుందో తెలిసిందే. అల్లరి, చిలిపితనం, దైవత్వం కలిసి ఉంటాయి. ఇప్పుడు అలాంటి పాత్రకు రవితేజ గాత్రం తోడైతే ఎలాంటి ఉంటుంది. అదిరిపోతుంది కదూ.. ఇప్పుడు హనుమాన్ సినిమాలోనూ అదే అల్లరి, కామెడీ ఉండబోతున్నాయి. దీంతో హనుమాన్ సినిమాపై మరింత క్యూరియాసిటి ఏర్పడింది. ఈ సందర్భంగా రవితేజకు ధన్యవాదాలు తెలిపింది చిత్రయూనిట్.

ఈ సినిమాను ఇతిహాసం రామయణంలోని హనుమంతుడి పాత్ర ఆధారంగా చేసుకుని రూపొందించారు. ఇందులో అమృత అయ్యార్, వినయ్ రామ్, సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో విడుదల చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.