Raviteja: రవితేజ బర్త్ డే ట్రీట్ రెడీ.. ‘ఈగల్’ నుంచి సరికొత్త సర్ప్రైజ్.. అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా వరుస చిత్రాలు రిలీజ్ అవుతుండడంతో వెనక్కి తగ్గింది. దీంతో ఇప్పుడు ఫిబ్రవరి 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై పై క్యూరియాసిటిని కలిగించాయి. ఈసారి ఈ చిత్రంలో రవితేజ సరికొత్త మేకోవర్ లో కనిపించనున్నాడు.
మాస్ మాహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ సినిమా ‘ఈగల్’. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా వరుస చిత్రాలు రిలీజ్ అవుతుండడంతో వెనక్కి తగ్గింది. దీంతో ఇప్పుడు ఫిబ్రవరి 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై పై క్యూరియాసిటిని కలిగించాయి. ఈసారి ఈ చిత్రంలో రవితేజ సరికొత్త మేకోవర్ లో కనిపించనున్నాడు. దీంతో ఈ మూవీపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మాస్ మాహారాజా బర్త్ డే రాబోతుంది. ఈసందర్భంగా అభిమానులకు సాలిడ్ అప్డేట్ అందించారు మేకర్స్.
రేపు జనవరి 26న రవితేజ బర్త్ డే సందర్భంగా మాస్ మహారాజా సరికొత్త మేకోవర్ ను రివీల్ చేస్తూ రేపు సినిమా మూడో సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. తాజాగా విడుదలైన చేసిన రవితేజ కొత్త పోస్టర్ ఆకట్టుకుంటుంది. స్టైలీష్ గా పోనీ టైల్ వేసుకుని అదరగొట్టాడు రవితేజ. ఇక రేపు వచ్చే ట్రీట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాకు డేవ్ జాన్ డి సంగీతం అందించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం ఫిలిం ఛాంబర్ పెద్దలకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సోలో డేట్ కోసం లేఖ రాసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండగ సమయంలో థియేటర్లు సర్దుబాటు కాలేదు. దీంతో రవితేజ సినిమాను వాయిదా వేయాలని ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు చెప్పడంతో ఈగల్ చిత్రాన్ని ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఈగల్ రిలీజ్ అవుతున్న సమయంలోనే మరిన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 8న యాత్ర 2, ఫిబ్రవరి 9న సందీప్ కిషన్ భైరవ కోన, లాల్ సలామ్ చిత్రాలు రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.
#EAGLE 🦅 / #Sahadev is ready to soar HIGH!! 💥
The 3rd single ~ “ Eagle’s on the way “ will be out on Jan 26th! 🔥@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla @RajaS_official @Sunilofficial @KavyaThapar @anupamahere @pnavdeep26 @VinayRai1809… pic.twitter.com/GZksSt5GDf
— People Media Factory (@peoplemediafcy) January 25, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.