
మాస్ మహారాజ రవితేజ కిక్ అప్పట్లో సూపర్ హిట్ అయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రవితేజ కెరీర్‌లో టాప్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. 2009 లో రిలీజైన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్. తమిళ నటుడు శ్యామ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ తర్వాత అతనిపేరు కిక్ శ్యామ్‌గా పేరు వచ్చింది. అలాగే ఈ సినిమాలో రవితేజ, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు కడుపు ఉబ్బేలా నవ్విస్తాయి. కిక్ సినిమాలో ప్రతి పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఈ సినిమాలో ఇలియానా చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా..? మూవీలో కనిపించేది కొద్ది సేపు అయినా తన బ్యూటీ ఆకట్టుకుంది ఆ క్యూటీ. సినిమాలో తొలుత రవితేజను ఇష్టపడ్డ యువతిగా మెప్పించిన ఈ అమ్మడి పేరు ఆషీకా బతిజా. కిక్ తర్వాత తను సినిమాలు చేయలేదు. చదువుపై ఫోకస్ పెట్టి లండన్ వెళ్లిపోయింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో స్థిరపడింది.
అయితే ఈ సినిమా చూసినప్పుడల్లా.. ఈ అమ్మాయి ఏమయింది..? ఇప్పుడు ఎలా ఉంది.? ఏం చేస్తుంది? అని నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు. ఆ వివరాలు మీ ముందుకు తీసుకొచ్చాం. తన మ్యారేజ్ చేసుకుని ఫారెన్‌లో సెటిల్ అయిపోయింది. అలాగే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటున్నా… సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్. తన ఫోటోలు, వీడియోలు తరుచుగా షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమెకు సంబందించిన లేటెస్ట్ ఫోటోలపై ఓ లుక్ వేద్దాం పదండి…