
మాస్ మహారాజ రవితేజ(Ravi Teja)వరస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి దూసుకుపోతున్నారు. రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ(Rama Rao On Duty).. రీసెంట్ గా ఖిలాడీ సినిమాతో వచ్చిన రవితేజ సాలిడ్ హిట్ ను అందుకోలేక పోయాడు. దాంతో ఇప్పుడు ఎలాగైనా భారీ హిట్ కొట్టాల్సిందే అని ఫిక్స్ అయ్యాడు. మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో రామారావు టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్.
ఈ నేపథ్యంలో తాజాగా రామారావు ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా హాజరయ్యారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.