Dhamaka: అఫీషియల్.. మాస్ మహారాజ ధమాకా మూవీ ఓటీటీకి వచేస్తుందోచ్.. స్ట్రీమింగ్ ఎక్కడ..? ఎప్పుడంటే..

|

Jan 11, 2023 | 12:05 PM

సక్సెస్ ఫుల్ దర్శకుడు త్రినాద్ రావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ మూవీలో రవితేజ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది.

Dhamaka: అఫీషియల్.. మాస్ మహారాజ ధమాకా మూవీ ఓటీటీకి వచేస్తుందోచ్.. స్ట్రీమింగ్ ఎక్కడ..? ఎప్పుడంటే..
Dhamaka
Follow us on

మాస్ మహారాజ రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. చాలా రోజులు తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నాడు రవితేజ. సక్సెస్ ఫుల్ దర్శకుడు త్రినాద్ రావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ మూవీలో రవితేజ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా  డిసెంబర్ 23న విడుదలైంది. రిలీజ్ అయినా అన్ని ఏరియాలనుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా. ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ల పై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. దాంతో ఈ సినిమాకు మొదటి షో నుంచే హిట్ టాక్ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ధమాకా సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. ధమాకా సినిమా ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ నెల 22న ధమాకా డిజిటల్ రిలీజ్ కానుంది. దాంతో రవితేజ

ఇవి కూడా చదవండి

మాస్ రాజా రవితేజ నుంచి ఇలాంటి హిట్ కోసమే ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. క్రాక్ సినిమా తర్వాత రవితేజ ధమాకా సినిమాతో హిట్ అందుకున్నారు. ఇక రవితేజ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అలాగే రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు చేస్తున్నాడు మాస్ రాజా.