అటు రాజకీయాలను.. ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ పక్కా ప్లానింగ్ తో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ఇటీవలే వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీర మల్లు సినిమా చేస్తున్నారు పవన్.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో పాటు గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ను సంప్రదిస్తున్నారట చిత్రయూనిట్.
భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్రకోసం బాలీవుడ్ నటి రవీనా టాండన్ ను అనుకుంటున్నారట హరీష్. ఇటీవలే కేజీఎఫ్ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించిన రవీనా.. ఆ సినిమాకే వన్ ఆఫ్ ది హైలైట్ గా నిలిచారు. రవీనా నటన.. హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇప్పుడు పవర్ స్టార్ సినిమాలో పాత్రకు ఆమె అయితేనే న్యాయం చేయగలదని భావించిన హరీష్ టీమ్ ఆమెను సంప్రదించారట. కథ నచ్చడంతో రవీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గతంలో మోహన్ బాబు ఫ్యామిలీ నటించిన పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో నటించిన రవీనా.. ఇప్పుడు పవర్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :