ఒక్క సినిమా ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలను షేక్ చేస్తుంది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీ ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అందుకొని కలెక్షన్స్ సునామి క్రియేట్ చేస్తుంది. కేజీఎఫ్ చాఫ్టర్ 2(KGF Chapter 2) ఇప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాస్తూ.. దూసుకుపోతుంది ఈ కన్నడ సినిమా.. మొదటి పార్ట్‌ను మించి కేజీఎఫ్ 2 భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.. కేజీఎఫ్ 2 సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు.. యశ్ నటన, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సౌత్ మాత్రమే కాదు.. నార్త్ ఆడియన్స్ నుంచి కేజీఎఫ్ 2 సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికీ ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతుంది.
టాప్ హీరోలను సైతం వెనక్కి నెట్టి దూసుకుపోతున్నాడు రాకీ భాయ్. కేజీఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో అన్ని భాషల్లో స్టార్ హీరోగా ఎదిగాడు యష్. ఇప్పుడు కేజీఎఫ్ చాఫ్టర్ 2 తో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. ఈ మూవీ 600 కోట్లకు మించి వసూళ్లని రాబట్టిందని రానున్న రోజుల్లో 1000 కోట్ల ని ఈ మూవీ అవలీలగా అధిగమించే అవకాశం వుందని ట్రేడ్ పండితులు. ఇక ఉత్తరాదిలో ఇప్పడు యష్ క్రేజీ స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ రవీనా టాండన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే..తాజాగా ఓ థియేటర్లో సినిమా ప్రదర్శన సందర్భంగా సినిమా చివర్లో ఏకంగా ప్రేక్షకులు రూపీ కాయిన్స్ ని వెదజల్లారు. ఈవీడియోను రవీనా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :