Rashmika Mandanna: ఏంది రష్మిక.. అసలు చిక్కేలా లేవుగా.. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాకు భారీ బిజినెస్..!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న స్టార్ పవర్ మరోసారి రుజువైంది. విడుదలకు ముందే ఆమె తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా రూ. 21 కోట్ల భారీ బిజినెస్ సాధించింది. ఇందులో ఓటిటి రైట్స్ మాత్రమే రూ. 14 కోట్లకు అమ్ముడవడం ఆమె పాన్‌ఇండియా క్రేజ్‌ను స్పష్టంగా చూపించింది.

Rashmika Mandanna: ఏంది రష్మిక.. అసలు చిక్కేలా లేవుగా.. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాకు భారీ బిజినెస్..!
Rashmika Mandanna

Edited By: Ram Naramaneni

Updated on: Nov 04, 2025 | 4:56 PM

నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఆమెకు ఎంత ఇమేజ్ ఉందో చెప్పడానికి తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ నాన్-థియేట్రికల్ బిజినెస్ ఒక ఎగ్జాంపుల్. సినిమా విడుదల కాకముందే ఈ చిత్రానికి వచ్చిన భారీ ఆదాయం ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. పెద్ద హీరోలతో సినిమాలు చేసినా నిర్మాతలకు చేతులు కాలుతున్న రోజులివి. అలాంటి ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విడుదలకు ముందే సేఫ్ అయిపోయింది. కేవలం రష్మిక స్టార్ పవర్, ఆమెకు దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ కారణంగానే ఈ అద్భుతమైన బిజినెస్ సాధ్యమైంది. ఆమె నటిస్తున్నారంటేనే ఆ ప్రాజెక్టుపై ఆటోమేటిక్‌గా అంచనాలు పెరిగిపోతాయి. ఇది బాక్సాఫీస్‌తో పాటు నాన్-థియేట్రికల్ హక్కుల విషయంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.

ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు రూ. 21 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇందులో ప్రముఖ ఓటిటి డిజిటల్ రైట్స్‌కు ఏకంగా రూ. 14 కోట్లు చెల్లించింది. ఇది రష్మికకు ఉన్న పాన్ ఇండియా అప్పీల్‌ను.. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఆమె కంటెంట్‌కు ఉన్న గిరాకీని తెలియజేస్తుంది. అలాగే శాటిలైట్ హక్కుల ద్వారా రూ. 4 కోట్లు, ఆడియో రైట్స్ రూపంలో రూ. 3 కోట్లు లభించడం రష్మిక క్రేజ్ ఏంటో చూపించాయి. మార్కెట్‌లో ఆమె బ్రాండ్ వాల్యూకు ఈ బిజినెస్ ఓ నిదర్శనం. ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు ఈ రేంజ్ బిజినెజ్ మాటలు కాదు. ఈ అద్భుతమైన బిజినెస్ వెనుక రష్మిక క్రేజ్‌తో పాటు గీతా ఆర్ట్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ బ్యానర్ వాల్యూ కూడా బాగా కలిసి వచ్చింది. అల్లు అరవింద్ సమర్పణలో సినిమా వస్తుండటం, ప్రొడక్షన్ పరంగా ఉన్న నమ్మకం, క్వాలిటీ.. ఇలాంటి అంశాలన్నీ కలిపి నాన్ థియెటర్ రేంజ్ పెంచేసాయి.

అయినప్పటికీ హీరోయిన్‌గా రష్మిక ఉండటం అనేది ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్, రష్మిక క్రేజ్ కలయిక.. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాను విడుదలకు ముందే సేఫ్ ప్రాజెక్ట్‌గా మార్చింది. నేషనల్ క్రష్‌గా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రష్మిక మందన్న.. తన నటన, గ్లామర్, అదిరిపోయే ఫాలోయింగ్‌తో ప్రేక్షకులను మాయ చేస్తుంది. ఇదే ట్రేడ్‌కు హెల్ప్ అయింది కూడా. హిట్‌లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా.. మార్కెట్‌లో ఆమెకున్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ది గర్ల్‌ఫ్రెండ్ నాన్-థియేట్రికల్ బిజినెస్ రూపంలో వచ్చిన రూ. 21 కోట్ల ఆదాయం కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు.. ఆమె స్టార్‌డమ్‌కు, బ్రాండ్ వాల్యూకు బలమైన నిదర్శనం. రాబోయే రోజుల్లో కూడా రష్మిక ప్రాజెక్టులు ఇదే స్థాయిలో బిజినెస్ చేస్తాయని ఈ విజయం రుజువు చేసింది. సినిమా నవంబర్ 7న విడుదల కానుంది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి