నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తక్కువ టైం లోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిన్నది. తెలుగుతో ఓటు తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా ఉంది ఈ చిన్నది. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇటీవకే యానిమల్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. రష్మిక నటిస్తున్న సినిమాల్లో పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ఒకటి. రష్మిక మందన్న నటించిన ‘పుష్ప’ సినిమా ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఈ సినిమా సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్న షూటింగ్ సెట్‌లో తీసిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘పుష్ప 2’ సినిమాలో హీరో అల్లు అర్జున్ గతంలో దర్శకుడు సుకుమార్ క్యాండిడ్ ఫోటోలను క్లిక్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు రష్మిక మందన్న వంతు వచ్చింది. సుకుమార్ సింహం విగ్రహంపై చేతులు పెట్టి ఫోజ్ ఇచ్చిన ఫోటో తీసింది రష్మిక మందన్న. ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
‘పుష్ప’ డిసెంబర్ 2021లో ప్రారంభమైంది. రెండేళ్లు గడిచినా సీక్వెల్ పై జనాల్లో క్రేజ్ మాత్రం తగ్గలేదు. క్రేజ్‌ను పెంచేందుకు షూటింగ్ సెట్‌లోని ఫోటోలను చిత్రబృందం షేర్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్, సుకుమార్‌లు మాటలాడుకుంటున్న ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. తాజాగా రష్మిక ఓ ఫోటో షేర్ చేసింది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో తన నటనకు గాను జాతీయ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత ‘పుష్ప2’పై అంచనాలు వంద రెట్లు పెరిగాయి. ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ చిత్ర బృందం దానిని ఖండించింది. అనుకున్నట్టుగానే ‘పుష్ప 2’ ఆగస్ట్ 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది. డాలీ ధనంజయ్, ఫహద్ ఫాసిల్ లాంటి నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.