డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ముఖ్యంగా పుష్పరాజ్ మేకోవర్.. స్టైల్.. యాటిట్యూడ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సౌత్ టూ నార్త్ ఆడియన్స్ పుష్ప చిత్రానికి ముగ్దులయ్యారు. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. మరోవైపు ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం యూట్యూబ్‌ను షేక్ చేశాయి. ఇక ఈ సినిమాకు సిక్వెల్‌గా రాబోతున్న పుష్ప 2పై అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమయ్యింది. (Rashmika Mandanna)అయితే ఈ సినిమాలో రష్మిక పాత్రపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె రోల్ మరింత బలంగా.. ప్రకాశవంతంగా ఉండాలనికి కోరుకుంటున్నారు అభిమానులు. ఈ క్రమంలో తాజాగా తన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చింది నేషనల్ క్రష్.
ఇటీవల పుష్ప 2 ప్రారంభమవుతుందంటూ రష్మిక తన ఇన్ స్టా ఖాతాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. పుష్పరాజ్ మళ్లీ వచ్చారు. ఈసారి రూలర్ గా. పుష్ప ది రూల్ పూజా కార్యక్రమం జరగనుంది. భారదేశం ఎక్కువగా ఎదురుచూస్తున్న సిక్వెల్ మరింత పెద్దగా ఉండబోతుంది. అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
తాజాగా ఆమె చేసిన పోస్ట్ ఓ అభిమాని స్పందిస్తూ.. పుష్ప ది రూల్. ఇందులో శ్రీవల్లి పాత్రను మరింత బలంగా ..ప్రకాశవంతంగా ఉండేలా చేయండి. పార్ట్ 2లో ధనంజయ్ కార్యెక్టరైజేషన్ కోసం చాలా ఆసక్తిగా ఉన్నాము అంటూ రాసుకొచ్చాడు. అతని కామెంట్‌కు రష్మిక రిప్లై ఇచ్చింది. అలాగే మనం కూడా చూద్దాం అంటూ ఎమోజీ షేర్ చేసింది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో తెగ బిజీగా ఉంది. ఇప్పటికే ఆమె నటించిన గుడ్ బై చిత్రం విడుదలకు సిద్దంగా ఉండగా.. మరోవైపు మిస్టర్ మజ్ను, యానిమల్ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
Highlights from #PushpaTheRule pooja ceremony ♥
Filming begins soon❤️?
BIGGER and GRANDER ?#ThaggedheLe ?#JhukegaNahi ?
Icon Star @alluarjun @iamRashmika @ThisIsDSP @aryasukku @SukumarWritings pic.twitter.com/zjAfXp0fPa
— Mythri Movie Makers (@MythriOfficial) August 22, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.