Rashmika Mandanna : 9 ఏళ్లలో 4 భాషల్లో 25 సినిమాలు.. ఇండియన్ సినిమా క్వీన్‏గా రష్మిక..

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఫుల్ జోష్ మీదున్న హీరోయిన్ రష్మిక. తెలుగు, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇటీవలే థామా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ అమ్మడు.. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది.

Rashmika Mandanna : 9 ఏళ్లలో 4 భాషల్లో 25 సినిమాలు.. ఇండియన్ సినిమా క్వీన్‏గా రష్మిక..
Rashmika Mandanna

Updated on: Oct 26, 2025 | 11:28 AM

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 9 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకుంది. 9 ఏళ్ల కెరీర్ లో నాలుగు భాషల్లో మొత్తం 25 మూవీస్ లో నటించింది రశ్మిక. ఈ సినిమాల్లో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ తో పాటు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సినిమాలు ఎన్నో ఉండటం విశేషం. హీరోయిన్స్ ప్రాంతీయంగా పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం కానీ పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలు సాధిస్తూ తన స్టార్ డమ్ క్రేజ్ చూపిస్తోంది రశ్మిక. అందం, నటన, ఆకర్షణతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. మరో హీరోయిన్ కు లేనంత క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది రష్మిక. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఒక్క రోజులోనే వరుస సినిమా చిత్రీకరణలలో పాల్గొంటుంది. హిందీ, తెలుగు సినిమా ప్రపంచంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది.

ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‏తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?

వెయ్యి కోట్ల రూపాయల సినిమాలను అలవోకగా అందుకుంటూ ఇండియన్ సినిమా క్వీన్ గా మారింది. రష్మిక నటించిన పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా, థామా చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాయి. అయితే బాక్సాఫీస్ నెంబర్స్ కంటే ప్రేక్షకుల ప్రేమే తనకు ముఖ్యమని చెబుతుంటుంది రష్మిక మందన్న. ఈ అందాలతార తన విజయాలను కొనసాగిస్తూ మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ లో రష్మిక పర్ ఫార్మెన్స్ మెస్మరైజ్ చేస్తోంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రష్మిక కెరీర్ లో మరో మైల్ స్టోన్ కాబోతోందనే ప్రెడిక్షన్స్ ట్రైలర్ సక్సెస్ తో ఏర్పడుతున్నాయి.

ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..

ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఇటీవలే థామా సినిమాతో హిందీలో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా.. మరోసారి తనదైన నటనతో అలరించింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో అడియన్స్ ముందుకు రానుంది..

ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..