Rashmika Mandanna: రష్మికపై కన్నడిగుల కోపానికి కారణమేంటి? నేషనల్ క్రష్ నిజంగానే అలా చేసిందా?

బెంగళూరు లో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభమైనప్పటి నుంచి పలు వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే రవికుమార్ గౌడ గనిగ నేషనల్ క్రష్ రష్మిక మందన్నాపై పరుష పదజాలంతో విరుచుకుపడడం తో పాటు కొన్ని సంచలన ఆరోపణలు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Rashmika Mandanna: రష్మికపై కన్నడిగుల కోపానికి కారణమేంటి? నేషనల్ క్రష్ నిజంగానే అలా చేసిందా?
Rashmika Mandanna

Updated on: Mar 04, 2025 | 7:26 AM

నేషనల్ క్రష్ రష్మిక మందన్నను కన్నడిగులు తరచూ ట్రోల్ చేస్తుంటారు. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో ‘నేను హైదరాబాద్ నుంచి వచ్చాను’ అని చెప్పి కన్నడిగుల ఆగ్రహానికి గురైందీ అందాల తార. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ రష్మికపై సంచలన ఆరోపణలు చేశారు. బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు కావడానికి ఆమె నిరాకరించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో రష్మిక మందన్నను ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆహ్వానించినప్పుడు, నేను హైదరాబాద్‌లో ఉన్నాను. కర్ణాటక ఎక్కడ ఉందో నాకు తెలియదు. నాకు సమయం లేదు. నేను రాలేను అని చెప్పింది. మా ఎమ్మెల్యేలలో ఒకరు ఆమె ఇంటికి వెళ్లి డజన్ల కొద్దీ ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. రష్మిక ఇప్పటికీ కన్నడ గురించి చాలా అహంకారంతో మాట్లాడుతుంది. మనం ఆమెకు కొంత జ్ఞానం నేర్పించాలి’ అని రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకటనపై రష్మిక మందన్న టీమ్ స్పందించినట్లు తెలుస్తోంది. ‘బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి రష్మిక రావడానికి నిరాకరించిందన్నది అవాస్తవం. కర్ణాటక గురించి ఆమె అగౌరవంగా మాట్లాడిందన్నది కూడా పూర్తిగా అబద్ధం. ఆమెను ఎవరో ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆహ్వానించారనేది కూడా నిజం కాదు’ అని నటి సన్నిహితులు చెప్పినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

 

 

 రోహిత్, రష్మిక లపై కామెంట్స్.. కాంగ్రెస్ నేతలపై   అభిమానుల ఆగ్రహం..

ఇటీవల, కరావే రాష్ట్ర అధ్యక్షుడు టి.ఎ. నారాయణ గౌడ కూడా రష్మికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ఇటీవల ఒక కార్యక్రమాన్ని చూస్తున్నాను.’ అందులో రష్మిక మందన్న అనే స్వచ్ఛమైన కన్నడ అమ్మాయి తాను హైదరాబాద్ నుంచి వచ్చానని చప్పింది. “మీరు కొంచెం పెద్దయ్యాక, వేరే భాషలో అవకాశం వచ్చిన వెంటనే, మీరు కన్నడ భూమిని మరచిపోతారా?’ అంటూ హీరోయిన్ పై మండి పడ్డారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.