
నటి రష్మిక మందన్నక్రేజ్ రోజు రోజుకు పెరిగీపోతోంది.. అమ్మడు ఈ మధ్యకాలంలో ఏం చేసినా అది హైలైట్ అవుతుంది. అతను ఎక్కడికి వెళ్లినా మీడియా ఈ ముడుగుమ్మను వదిలిపెట్టడంలేదు. ఇప్పుడు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక మందన్న అనుకోకుండా పప్పులో కాలేసింది. ఇది కాస్త అక్కడున్న మీడియా కెమెరాలో చిక్కింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఈవీడియో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక తెలుగులో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. పుష్ప సినిమాతో ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. ఈ సినిమాతో రష్మిక మందన్న క్రేజ్ తో పాటు తమిళ్, బాలీవుడ్ లోనూ ఆఫర్స్ క్యూ కట్టాయి. బాలీవుడ్ లోనూ ఈ చిన్నది చాలా బిజీగా మారిపోయింది.
తాజాగా రష్మిక మందన్న ముంబై విమానాశ్రయం లో కనిపించింది. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చే హడావిడిలో ఈ చిన్నది పప్పులో కాలేసింది. బయటకి రాగానే హడావిడిగా ఎదురుగా ఉన్న కారులోకి ఎక్కబోయింది రష్మిక. అప్పుడు రష్మిక టీమ్ ‘ఆ కారు కాదు’ అని గట్టిగా అరిచారు. దాంతో రష్మిక నవ్వుతూ తన కారు దగ్గరకు వెళ్లింది.
‘యానిమల్’ సినిమా సక్సెస్ మీట్ శనివారం (జనవరి 6) ముంబైలో జరిగింది. ఇందులో పాల్గొనేందుకు రష్మిక ముంబైకి చేరుకుంది. కార్యక్రమం ఆలస్యమవడంతో ఆమె హడావుడి గా కనిపించింది. ‘యానిమల్’ సినిమా డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రీ, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు నటించారు. ఈ సినిమాతో రష్మిక మందన్న భారీ విజయాన్ని అందుకుంది. బాలీవుడ్‌లో రష్మిక ఆదరణ పెరుగుతోంది. రష్మిక మందన్న ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా ఉంది. ఇది కాకుండా ఆమె చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. రష్మికకు చాలా సినిమా ఆఫర్లు వస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.