
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన రెండు సినిమాలు ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అందులో ఒకటి ‘ద గర్ల్‌ఫ్రెండ్’ శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే అంతకన్నా ముందే రష్మిక నటించిన ఓ అడ్వెంచర్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా సైలెంట్ గా.. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో యాక్ట్ చేస్తోంది రష్మిక. అలా ఆమె బాలీవుడ్ లో నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ థామా. మాడాక్ హారర్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్నా బేతాళి గా కనిపించింది.. అంటే రక్తం తాగే వ్యాంపైర్ పాత్రలో అన్నమాట. ఆమెతో పాటు ఆయుష్మాన్ ఖురాన్ మరో కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్ గా భయపెట్టాడు.
దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సుమారు రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స్ ను భయపెట్టిన ఈ మూవీ ఇప్పడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చింది. థామా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం (డిసెంబర్ 02) నుంచి ఈ హారర్ థ్రిల్లర్ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. ప్రస్తుతం హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. థామా మూవీ ప్రస్తుతం రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. అంటే అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రైబర్లు కూడా ఈ మూవీ చూడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. అయితే త్వరలోనే ఈ మూవీ ఉచితంగా స్ట్రీమింగ్ కు రావొచ్చు.
Name: #Thamma (2025)
OTT: #PrimeVideo (Available to rent in ₹349)
👉 Watch here: https://t.co/y26ocG7wKH pic.twitter.com/UrNWfOGfsy
— OTT ZONE (@hiiiii0600) December 1, 2025
TADAKA: My Superhero 🤩 This character fulfills a long-time wish of every fan like me who wanted to see #RashmikaMandanna in a fierce action avatar 🥹
Tadaka is one of her best roles and has permanently captured my heart. Can’t wait for Thamma on OTT 🔥 pic.twitter.com/Yc6l1QDT4c— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) November 30, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.