Rashmika Mandanna: ‘రౌడీ’ హూడీలో నేషనల్ క్రష్.. ఒకే డ్రెస్‍లో కనిపించిన విజయ్, రష్మిక.. ఫోటోస్ వైరల్..

|

Dec 01, 2023 | 8:55 AM

సందీప్ డైరెక్షన్ లో రణబీర్, రష్మిక కలిసి నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాకు ఇప్పటివరకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఇదంతా పక్కనపెడితే నేషనల్ క్రష్ సినిమాల గురించి కాకుండా ఆమె వ్యక్తిగత జీవితం గురించి నిత్యం ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండతో రష్మిక స్నేహం గురించి అనేక రకాల వార్తలు వింటుంటాం. వీరిద్దరి మధ్య ఏం ఉంది ? అనే చర్చలు మాత్రం సోషల్ మీడియాలో వినిపిస్తుంటాయి.

Rashmika Mandanna: రౌడీ హూడీలో నేషనల్ క్రష్.. ఒకే డ్రెస్‍లో కనిపించిన విజయ్, రష్మిక.. ఫోటోస్ వైరల్..
Rashmika Mandanna, Vijay De
Follow us on

కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి .. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా బిజీ అయ్యింది రష్మిక మందన్నా. అభిమానులంతా నేషనల్ క్రష్ అంటూ పిలుచుకునే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు యానిమల్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. సందీప్ డైరెక్షన్ లో రణబీర్, రష్మిక కలిసి నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాకు ఇప్పటివరకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఇదంతా పక్కనపెడితే నేషనల్ క్రష్ సినిమాల గురించి కాకుండా ఆమె వ్యక్తిగత జీవితం గురించి నిత్యం ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండతో రష్మిక స్నేహం గురించి అనేక రకాల వార్తలు వింటుంటాం. వీరిద్దరి మధ్య ఏం ఉంది ? అనే చర్చలు మాత్రం సోషల్ మీడియాలో వినిపిస్తుంటాయి. అయితే ఇప్పటివరకు తమ గురించి వీరిద్దరు స్పందించలేదు. కానీ హింట్స్ మాత్రం వస్తూనే ఉంటాయి.

ఇటీవల యానిమల్ ప్రమోషన్లలో భాగంగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో పాల్గొంది రష్మిక. ఈ క్రమంలో విజయ్ ఫోన్ కాల్, రణబీర్ బయటపెట్టిన సిక్రెట్స్ గురించి తెలిసిందే. అలాగే హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్, రష్మిక ఫోటోస్ వాడడం పైన కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక కొద్దిరోజుల క్రితం రష్మిక తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోలను విజయ్ ఫోటోలతో కలిపి షేర్ చేస్తున్నారు. ఇక తాజాగా మరోసారి వీరిద్దరి రిలేషన్ గురించి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ నుంచి రిటర్న్ అయ్యింది. ఆ సమయంలో ఆమె రౌడీ హూడీ ధరించింది. అంతకు ముందు తెలంగాణ ఎన్నికలలో ఓటు వేయడానికి వెళ్లినప్పుడు విజయ్ సైతం అదే రకం హూడీ ధరించాడు. ఈ రెండు హూడీలు.. విజయ్ సొంత క్లాత్ బ్రాండ్ RWDY బ్రాండ్‏కు చెందినవి.

ఢిల్లీ నుంచి రష్మిక రిటర్న్ వస్తున్న సమయంలో ఎయిర్ పోర్టులో ఫోటోగ్రాఫర్స్ రష్మికతో ఫన్నీగా మాట్లాడారు. విజయ్ దేవరకొండ డ్రెస్ వేసుకున్నారు కదా అని అనగానే రష్మిక నవ్వేసింది. ఒకేరోజు ఇద్దరూ ఒకే దుస్తులను ధరించడంతో విజయ్ తన దుస్తుల బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నడా ? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.