చూసీ చూడంగానే నచ్చాశావే అంటూ రష్మిక ఇండస్ట్రీకి వచ్చిన కొన్ని రోజుల్లోనే బాలీవుడ్ స్థాయికి రీచ్ అయ్యేలా చేశారు ఫ్యాన్స్. అయితే అంతటితో ఆగేదేలే అంటోంది రష్మిక సేన. ఇంతకీ వారందరూ కోరుకుంటున్నదేంటి? తెలుసుకుందాం పదండి.
ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొన్న రష్మికను ఫ్యాన్స్ హాలీవుడ్ సినిమా ఎప్పుడు చేస్తారంటూ క్వశ్చన్ చేశారు. వెంటనే రష్మిక స్పందిస్తూ “నో కామెంట్స్. ఇప్పట్లో ఏమీ చెప్పను. ఆ స్థాయి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం“ అని క్యూట్‌గా ఆన్సర్ చేశారు. ఎట్ ప్రెజెంట్ హైదరాబాద్‌లో పుష్ప షూట్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు రష్మిక. కోవిడ్ సిట్చువేషన్ వల్ల తన ఫ్యామిలీని కలిసి 4-5 నెలలు అయిందన్న ఈ టాలెంటెడ్ గర్ల్… ఫ్యామిలీ మెంబర్స్ ని మిస్ అవుతున్నట్టు తెలిపారు.
అంతే కాదు.. కోవిడ్ బారిన పడకుండా అందరూ తమను తాము రక్షించుకోవాలని, ఫ్రెండ్స్ ని కలవద్దని, ఎక్సర్‌సైజులు చేయమని సలహా ఇచ్చారు. ఎక్కువ మేకప్ వేసుకోకపోవడం వల్ల ఇప్పుడు తన స్కిన్ చాలా ఫ్రెష్‌గా ఉందని అన్నారు.విజయ్ దేవరకొండతో సినిమా గురించి ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు… విజయ్‌నీ, తననూ స్క్రీన్ మీద బెస్ట్ పెయిర్‌గా ఊహిస్తూ ఎవరైనా దర్శకుడు కథ రాస్తే చేయడానికి సిద్ధమేనని అన్నారు.
Also Read: సినిమాల్లో చెప్పడమే కాదు, రియల్ లైఫ్ లోనూ చేసి చూపిస్తోన్న మోహన్ లాల్