Pawan Kalyan: వైరల్ అవుతోన్న పవన్ కళ్యాణ్ రేర్ ఫోటో.. దీన్ని మీరెప్పుడు చూసి ఉండరు

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన రేర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు తెలియని తెలుగు వారు ఉండరు.

Pawan Kalyan: వైరల్ అవుతోన్న పవన్ కళ్యాణ్ రేర్ ఫోటో.. దీన్ని మీరెప్పుడు చూసి ఉండరు
Pawan Kalyan

Updated on: Feb 19, 2023 | 8:08 AM

సోషల్ మీడియాలో సినిమా సెలబ్రెటీల ఫోటోలు కోకొల్లలుగా ఉంటాయి. ప్రతి రోజు ఎదో ఒక హీరోలేదా హీరోయిన్ ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. నటీనటుల చిన్ననాటి ఫొటోలదగ్గర నుంచి లేటెస్ట్ పిక్స్ వరకు అభిమానులు షేర్ చేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తూ ఉంటారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన రేర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు తెలియని తెలుగు వారు ఉండరు. పవన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పాన్ ఇండియా సినిమా చేయకపోయినా కూడా ఆయనకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక పవర్ స్టార్ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ మర్షలర్ట్స్ లో శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే.. తొలి సినిమాలోనే ఆయన పలు సాహసాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఇక తాజాగా వైరల్ అవుతున్న ఫొటోలో పవన్ కళ్యాణ్ మర్షలర్ట్స్ ప్రాక్టీస్ చేస్తోన్న ఫొటో. ఈ ఫొటోలో పవన్ చేతికి గాయం  కూడా చూడొచ్చు. చేతికి రక్తం కారుతున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ నటిస్తున్నారు పవన్. మరో వైపు రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు.Pawan Kalyan