“బధిరుల భాషను అధికార భాషగా గుర్తించాలి”

|

Sep 20, 2020 | 5:42 PM

బధిరుల సైగ భాషను అధికార భాషగా ప్రకటించాలని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కోరారు. ఇండియన్ సైన్ లాంగ్వేజ్(ఐఎస్ఎల్)ను ఇండియా 23వ అధికార భాషగా అనౌన్స్ చేయాలన్న వినతిపత్రంపై ఆయన సైన్ చేశారు.

బధిరుల భాషను అధికార భాషగా గుర్తించాలి
Follow us on

బధిరుల సైగ భాషను అధికార భాషగా ప్రకటించాలని బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ డిమాండ్ చేశారు. ఇండియన్ సైన్ లాంగ్వేజ్(ఐఎస్ఎల్)ను ఇండియా 23వ అధికార భాషగా అనౌన్స్ చేయాలన్న వినతిపత్రంపై ఆయన సైన్ చేశారు. అంతేకాకుండా తన రికార్డ్ లేబుల్ కంపెనీ ఇన్క్లింక్  ద్వారా మూగ భాషలో మ్యూజిక్ వీడియోలు కూడా రూపొందించారు. దేశంలోని కోటి మంది బధిరులకు వినోదం, విద్య, ఉపాధి అందించేందుకు తన లేబుల్ కంపెనీ ఓ వేదిక కల్పించిందని తెలిపారు.

తమకు మద్దతు తెలిపినందుకు బధురులు రణ్ వీర్ సింగ్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. తమది ఎంతో అందమైన లాంగ్వేజ్ అని, బాలీవుడ్ అగ్రహీరో తమ వెనుక నిలబడినందుకు ఆనందంగా ఉందని ఓ ప్రకటనలో కొనియాడారు.  రణ్ వీర్ సింగ్ మాత్రమే  కాదు పలువురు సెలబ్రిటీలు కూడా ‘మూగ భాష’కు ఇండియన్ గవర్నమెంట్ తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు.

Also Read :

ఏపీలో రేపటి నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం.. ఈ రూల్స్ తప్పనిసరి

వానలే వానలు : మరో అల్పపీడనం, ఏపీకి భారీ వర్ష సూచన