రీరిలీజ్ ట్రెండ్ రోజు రోజుకు మరింత ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే విడుదలైన చిత్రాలను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోస్ సినిమాలను మరోసారి రిలీజ్ చేయగా.. కలెక్షన్స్ ఏ రేంజ్ లో వచ్చాయో తెలిసిందే. పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా విడుదలైన గుడుంబా శంకర్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సూపర్ హిట్ మూవీ 7G బృందావన్ కాలనీ సినిమాను రీరిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాను 4కే వెర్షన్ లో సెప్టెంబర్ 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించగా.. యూత్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో చిత్రం రీరిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. అదే శేఖర్ కమ్ముల చిత్రం లీడర్.
2010లో థియేటర్లలో విడుదలైన ఈ పొలిటికల్ డ్రామా సూపర్ హిట్ అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాతో రానా దగ్గుబాటి హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఎంట్రీలోనే సీఎం అర్జున్ ప్రసాద్ పాత్రలో జీవించి.. తన నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికే రానా కెరీర్ లో అర్జున్ ప్రసాద్ పాత్ర ఓ మార్క్ అనే చెప్పాలి. శేఖర్ కమ్ముల, రానా కాంబోలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాను రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2024 సాధారణ ఎన్నికలలోపు ఈ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయనున్నట్లు సమాచారం.
లేటేస్ట్ అప్టేడ్ ప్రకారం ఈ సినిమాను ఫిబ్రవరి 19న థియేటర్లలో రీరిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. దీనిపై పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారన తెలుస్తోంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటించగా.. హర్షవర్దన్, కోట శ్రీనివాస రావు, రావు రమేశ్ కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.