Rana Daggubati: భల్లాల దేవ బాడీ సీక్రెట్ ఇదే.. రానా దగ్గుబాటి ఫిట్‌నెస్ ప్లాన్స్ తెలిస్తే షాకవుతారు..

రానా దగ్గుబాటి.. లీడర్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి.. మొదటి చిత్రంతోనే నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. హీరోగానే కాకుండా విలన్ గా, నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు. ఈరోజు (డిసెంబర్ 14న) రానా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Rana Daggubati: భల్లాల దేవ బాడీ సీక్రెట్ ఇదే.. రానా దగ్గుబాటి ఫిట్‌నెస్ ప్లాన్స్ తెలిస్తే షాకవుతారు..
Rana

Updated on: Dec 14, 2025 | 11:10 AM

టాలీవుడ్ హీరో రానా పుట్టిన రోజు నేడు (డిసెంబర్ 14). ఈరోజు ఆయన 41వ బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లీడర్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన రానా.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇందులో భల్లాల దేవ పాత్రలో అద్భుతమైన నటన, ఫిట్‌నెస్ తో కట్టిపడేశాడు. ముఖ్యంగా భల్లాల దేవ పాత్రలో భారీ శరీరాకృతితో అందరిని ఆశ్చర్యపరిచాడు రానా. దీంతో అతడి ఫిట్‌నెస్ సీక్రెట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు. బాహుబలి సినిమా కోసం రానా.. కఠినమైన ఫిట్‌నెస్ ప్లాన్ ప్రారంభించారట.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : సుమన్ శెట్టి ప్రభంజనం.. బిగ్‏బాస్ హిస్టరీలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్.. 14 వారాలకు ఎంత సంపాదించాడంటే..

గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. హైదరాబాద్ వంటి నగరంలో పూర్తిగా విలాసాలను నివారించడం ‘వృధా’ అని అన్నారు రానా. ఆరోగ్యంగా… ఫిట్‌నెస్ పరంగా జాగ్రత్తగా ఉండాలంటే ముందు యాక్టివ్ గా ఉండే లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలని అన్నారు. ‘ నేను నటుడిని, కాబట్టి నేను తిరుగుతూ ఉండాలి. అది ఫ్లాబ్‌ను అదుపులో ఉంచుతుంది… చీట్ ఫుడ్? అదేంటి? నేను తినే ప్రతిదీ ఒక విధంగా చీట్ ఫుడ్. హైదరాబాద్ లాంటి నగరంలో ఆహారం తినకుండా ఉండలేరు. అది చాలా వృధా అవుతుంది. నేను తీపి పదార్థాలకు దూరంగా ఉంటాను” అని అన్నారు. “నేను ఏమి తిన్నా, నేను అంతే కష్టపడి వ్యాయామం చేస్తాను. వ్యాయామం చేయడానికి ప్రత్యామ్నాయం లేదు. జిమ్‌లో శ్రమించకుండా ఏ ఆహారం కూడా మీకు కావలసిన శరీరాన్ని అందించదు.” అని అన్నారు.

ఇవి కూడా చదవండి : 11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తెలుగులో తోపు హీరోయిన్..సైన్యంలో పనిచేసి ఉరి దాడిలో మరణించిన తండ్రి..

రానా హైట్ 6.3 అడుగులు. తన శరీరానికి అవసరమైన ఫుడ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారట. శరీరానికి బరువైన లిఫ్టింగ్ అవసరమని రానా తెలిపారు. “నా రోజును ప్రారంభించడానికి నేను జిమ్‌లో మంచి గంటసేపు ఘనమైన కార్డియో వ్యాయామం చేస్తాను. సాధారణంగా రోజంతా షూటింగ్ ఉంటుంది, ఇది నన్ను బిజీగా, కదిలేలా చేస్తుంది. ప్యాక్-అప్ తర్వాత, అంటే సాయంత్రం 7 గంటల ప్రాంతంలో, నేను 7 సంవత్సరాలుగా నాతో ఉన్న నా శిక్షకుడు కునాల్ గిర్‌తో రెండు గంటల వ్యాయామం ప్రారంభిస్తాను. రెగ్యులర్ వ్యాయామంలో ఎక్కువగా హార్డ్‌కోర్ బరువులు ఎత్తడం ఉంటుంది. నేను నా హైస్కూల్, కాలేజీలో బాక్సర్‌ని కూడా, కాబట్టి నేను నా వ్యాయామాన్ని కొంచెం బాక్సింగ్‌తో కలుపుతాను” అని అన్నారు.

ఇవి కూడా చదవండి : Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

ఇవి కూడా చదవండి :  Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..