మాట నిలుపుకున్న నితిన్.. సినిమాను ప్రకటించేశాడు

| Edited By:

Mar 21, 2019 | 1:13 PM

తన తదుపరి ప్రాజెక్ట్‌లపై ఈ నెలాఖరులోగా చెబుతానని ట్విట్టర్ వేదికగా ప్రామిస్ వేసిన నితిన్ ఆ మాటను నిలుపుకున్నాడు. హోళీ సందర్భంగా నితిన్ నటించనున్న ఒక చిత్రంపై అధికారిక ప్రకటన వెలువడింది. ‘ఒక ఊరిలో’, ‘వీర’, ‘రైడ్’, ‘అమ్మాయితో అబ్బాయి’ వంటి సినిమాలను తెరకెక్కించిన రమేశ్ వర్మ దర్శకత్వంలో నితిన్ నటించనున్నాడు. ఏ స్టూడియో బ్యానర్‌‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది. https://twitter.com/baraju_SuperHit/status/1108627709855330304 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం ఆగష్టు నుంచి సెట్స్ మీదకు […]

మాట నిలుపుకున్న నితిన్.. సినిమాను ప్రకటించేశాడు
Follow us on

తన తదుపరి ప్రాజెక్ట్‌లపై ఈ నెలాఖరులోగా చెబుతానని ట్విట్టర్ వేదికగా ప్రామిస్ వేసిన నితిన్ ఆ మాటను నిలుపుకున్నాడు. హోళీ సందర్భంగా నితిన్ నటించనున్న ఒక చిత్రంపై అధికారిక ప్రకటన వెలువడింది. ‘ఒక ఊరిలో’, ‘వీర’, ‘రైడ్’, ‘అమ్మాయితో అబ్బాయి’ వంటి సినిమాలను తెరకెక్కించిన రమేశ్ వర్మ దర్శకత్వంలో నితిన్ నటించనున్నాడు. ఏ స్టూడియో బ్యానర్‌‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది.

https://twitter.com/baraju_SuperHit/status/1108627709855330304

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం ఆగష్టు నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి నటరాజన్ సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాదిలో రెండు చిత్రాలను విడుదల చేసేలా ప్లాన్ వేసుకుంటున్నానని నితిన్ తెలిపిన విషయం తెలిసిందే.