Ram Charan : మ్యాన్ విత్ గోల్డ్ హార్ట్.. మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాపవర్ స్టార్

మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్. చిరుత సినిమాతో హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్ ఆతర్వాత స్టార్ హీరోగా మారిపోయాడు.

Ram Charan : మ్యాన్ విత్ గోల్డ్ హార్ట్.. మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాపవర్ స్టార్
Ram Charan1

Updated on: Jul 07, 2022 | 5:13 PM

మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్(Ram Charan). చిరుత సినిమాతో హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్ ఆ తర్వాత స్టార్ హీరోగా మారిపోయాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ టాప్ గా మారిపోయాడు చరణ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా చరణ్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. ఆతర్వాత ధ్రువ, రంగస్థలం, రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలతో చరణ్ రేంజ్ పెరిగిపోయింది. అయితే ఎంత స్టార్ హీరో కొడుకైనా.. టాప్ హీరో రేంజ్ అనుకున్నా చరణ్ చాలా ఒదిగి ఉంటాడు. ఇదే విషయాన్ని ఇండస్ట్రీ చాలా మంది అంటూ ఉంటారు. చరణ్ మంచి మనసు గురించి సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటారు. తాజాగా కమెడియన్ సత్య కూడా చరణ్ పై పొగడ్తల వర్షం కురిపించాడు.

ప్రస్తుతం చరణ్ శంకర్ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన కీలక ఘట్టాల చిత్రీకరణ జరుగుతోంది. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.ఈ సినిమా అమృత్ సర్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో కమెడియన్ సత్య కూడా నటిస్తున్నారు. అయితే అమృత్ సర్ లో చరణ్ సన్నివేశాలు పూర్తయ్యాయి. దాంతో చరణ్ హైదరాబాద్ కు పయనమయ్యాడు. అలాగే కమెడియన్ సత్య కూడా తన షూటింగ్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ రావాల్సి ఉండగా విషయం తెలుసుకున్న చరణ్ తన సొంత విమానంలో సత్యను హైదరాబాద్ కు తనతో పాటు తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో చరణ్ మనసు చాలా మంచి అంటూ సత్య చెప్పుకొచ్చారు. ఎంత స్టార్ డమ్ ఉన్నా చరణ్ మనసు బంగారం అంటున్నారు మెగా ఫ్యాన్స్. సోషల్ మీడియా వేదికగా చరణ్ వ్యక్తిత్వాన్ని కొనియాడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి