AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Pothineni: రియల్ హీరో అనిపించుకున్న రామ్ .. అరుదైన వ్యాధితో బాధపడుతోన్న అమ్మాయి కోసం ఏం చేశాడో తెలుసా?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రియల్ హీరో అనిపించుకున్నారు. అరుదైన వ్యాధితో పోరాడుతున్న తన అభిమాని దీన పరిస్థితిని తెలుసుకుని వెంటనే స్పందించారు. ఆ కుటుంబానికి తన వంతు సాయం చేసి అందరి మన్ననలు అందుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Ram Pothineni: రియల్ హీరో అనిపించుకున్న రామ్ .. అరుదైన వ్యాధితో బాధపడుతోన్న అమ్మాయి కోసం ఏం చేశాడో తెలుసా?
Ram Pothineni
Basha Shek
|

Updated on: Sep 13, 2026 | 3:01 PM

Share

టాలీవుడ్ క్రేజీ హీరో రామ్ పోతినేని మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. సిల్వర్ స్క్రీన్ పై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ హీరో నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్నారు. అరుదైన జెనెటిక్ డిజార్డర్ తో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఒక అభిమానికి అండగా నిలిచారు రామ్. సదరు అమ్మాయి చికిత్స కోసం అయ్యే పూర్తి ఖర్చును భరిస్తానని మాటిచ్చాడు రామ్. అందులో భాగంగా తాజాగా ఆమె ఇంటికి నిత్యావసర వస్తువులు పంపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాలోని దుప్పలపూడి గ్రామానికి చెందిన 18 ఏళ్ల శశి అనే అమ్మాయి తీవ్రమైన ఓ అరుదైన జన్యువ్యాధితో బాధపడుతోంది. ఈ కారణంగా మతిస్థిమితం కోల్పోయిన ఆమె చాలా ఏళ్లుగా మంచానికే పరిమితవయ్యింది. అయితే శశికి హీరో రామ్ అంటే ఇష్టం. ఎంతలా అంటే రామ్ ఫొటోలు చూస్తే రియాక్ట్ అవుతుంది. అలాగే అన్నం తింటుందట. కాగా సోషల్ మీడియా ద్వారా శశి దీన పరిస్థితి గురించి తెలుసుకున్న రామ్ కొద్ది రోజుల క్రితమే ఆమెతో వీడియో కాల్ మాట్లాడాడు. శశికి బాగా ధైర్యం చెప్పారు. శశి చికిత్సకు అవసరమైన ఖర్చును భరిస్తానని మాటిచ్చాడు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నాడు రామ్. శశికి అవసరమైన మందులు, నిత్యవసర సరుకులు, పౌష్టిక ఆహారంతో పాటు తన కళ్లజోడును కూడా బహుమతిగా పంపాడు. తాజాగా రామ్ పోతినేని అభిమానులు ఈ వస్తువులను శశి కుటుంబానికి అందించారు

కాగా శశి వైద్య ఖర్చులను కూడా తానే భరిస్తానని రామ్ మరోసారి ఆ అమ్మాయికి భరోసా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో రామ్ పోతినేనిపై సినీ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రియల్ హీరో అంటూ రామ్ కు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే.. గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు రామ్. దీంతో ఇప్పుడు ఆయనే స్వయంగా మెగాఫోన్ పట్టుకొని రంగంలోకి దిగారు. తన నెక్స్ట్ మూవీలో హీరోగా నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. తాజాగా ఈ మూవీలో హీరోయిన్ సంయుక్త మీనన్ కీ రోల్ ప్లే చేస్తుందని మూవీ టీమ్ ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us