
రామ్ పోతినేని నటిస్తున్న మాస్ మసాలా మూవీ స్కంద. ఇస్మార్ శంకర్ సినిమా తర్వాత సరైన సక్సెస్ లేక సతమతం అవుతున్న రామ్ ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అఖండ సినిమాతో సంచలన విజయం సాధించిన బోయపాటి శ్రీను ఇప్పుడు రామ్ తో స్కంద అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి శ్రీను తన స్టైల్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. పోస్టర్ దగ్గర నుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది స్కంద. ఇక రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బోయపాటి స్టైల్ లో ఈ సినిమా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ఈ ట్రైలర్ పై పలు ట్రోల్స్ కూడా వచ్చాయి. గతంలో బోయపాటి తెరకెక్కించిన ‘దమ్ము’ ‘సరైనోడు’ ‘జయ జానకి నాయక’ ‘వినయ విధేయ రామ’ సినిమాలు కలిపి ఈ సినిమాలో చూపించినట్టు ఉంది అంటూ ట్రోల్స్ వచ్చాయి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు.
A Massive Thunder⚡️
Here’s the #SkandaTrailer in Tamil, Hindi, Kannada & Malayalam ❤️🔥
– https://t.co/uPHXc61x2e#SkandaOnSep15 #RAPOMass
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @MusicThaman @srinivasaaoffl @SS_Screens @ZeeStudios_ @lemonsprasad @JungleeMusicSTH pic.twitter.com/dRNUkFp93x
— Skanda Movie Official (@SkandaOffl) August 27, 2023
తెలుగుతో పాటు తమిళ్, మలయాళ , కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ తాజా రికార్డ్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో స్కంద ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది. ‘స్కంద’ ట్రైలర్ 50 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తుంది.
A Massive Milestone!!❤️🔥#SkandaTrailer rage hits 50 Million+ Views on YouTube💥
– https://t.co/uPHXc61x2e#SkandaOnSep28 in Telugu, Hindi, Tamil, Malayalam & Kannada!❤️#RAPOMass pic.twitter.com/5fAS6u4uKb
— Skanda Movie Official (@SkandaOffl) September 7, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.