
ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని ప్రదాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం స్కంద. ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. అఖండ తర్వాత బోయపాటి రూపొందిస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 15న అడియన్స్ ముందుకు రానుంది. తెలుగుతోపాటు… తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు మేకర్స్. ఇందులో రామ్ ఫుల్ మాస్ హీరోగా కనిపించనున్నట్లు ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు నందమూరి నటసింహం బాలకృష్ణ ముఖ్య అతిథిగా హజరయ్యారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. బాలకృష్ణ చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో రామ్ పోతినేని మరో లెవల్లో చూపించారు డైరెక్టర్ బోయపాటి. అంతేకాకుండా మరోసారి మాస్ అడియన్స్ కు ఫుల్ మీల్స్ కు ఇచ్చేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ చేస్తుంటే.. బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ అదిరిపోయాయి. తియ్యాలే, పొయ్యాలే, గట్టిగా అరిస్తే తొయ్యాలే, అడ్డం వస్తే లేపాలి అంటూ రామ్ చెప్పే డైలాగ్స్ తో సినిమాపై ఆసక్తిని పెంచారు.
PULLIIII YAAATTTAAAKOCHINDHHIII!!! https://t.co/smsQ0EbchG#SKANDATRAILER pic.twitter.com/fX5qi3vomY
— RAm POthineni (@ramsayz) August 26, 2023
ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో డ్యాన్స్ అదరగొట్టేవారిలో రామ్ ఒకరు. ఇక శ్రీలీల, రామ్ కలిసి చేసే డాన్స్ వేరేలెవల్లో ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటల్లోనూ వీరిద్దరి డాన్స్ ఏ రెంజ్ లో ఉందో చెప్పక్కర్లేదు. ఫ్లోర్ మూమెంట్స్ తో ఇద్దరు అదరగొట్టేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.