Ram Gopal Varma : వర్మకు అపాయింట్ మెంట్ దొరికిందోచ్.. మంత్రి నానిని ఎప్పుడు కలవనున్నడంటే..

టాలీవుడ్ కు ఏపీ ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై సినిమా ఇండస్ట్రీ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Ram Gopal Varma : వర్మకు అపాయింట్ మెంట్ దొరికిందోచ్.. మంత్రి నానిని ఎప్పుడు కలవనున్నడంటే..
Rgv

Updated on: Jan 08, 2022 | 9:16 AM

Ram Gopal Varma : టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై సినిమా ఇండస్ట్రీ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదంలోకి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. వారం రోజులుగా హీట్‌ పెంచిన వర్మ, నాని మాటల యుద్ధం ఇప్పుడు ఓ చర్చకు దారితీయబోతోంది. టీవీ9 బిగ్‌ డిబేట్‌లో ఇద్దరి మధ్య సవాళ్లపర్వం నడిచింది. తర్వాత వర్మ ట్వీట్లు ఎంతో హీట్‌ను పెంచాయి. ఆయనకు కొందరు టాలీవుడ్‌ ప్రముఖులు కూడా మద్దతు తెలిపారు. తన యూట్యూబ్‌ ఛానల్‌, సోషల్‌ మీడియా వేదికగా ఆ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో మంత్రి నాని ట్విటర్‌లో స్పందించారు. అలా ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు.

చివరగా.. ప్రభుత్వంతో గొడవపడాలనేది తన ఉద్దేశం కాదని, అనుమతిస్తే కలుస్తానని ఆర్జీవీ.. నానిని కోరారు. ‘త్వరలోనే కలుద్దాం’ అని నాని ఇటీవల రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలో తనకు పేర్ని నాని నుంచి పిలుపు వచ్చిందని ఆర్జీవీ ట్వీట్‌ పెట్టారు. సినిమా టికెట్‌ ధరల విషయం చర్చించేందుకు తనను ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ఆహ్వానించారని రామ్‌గోపాల్‌ వర్మ పోస్ట్‌ చేశారు. తన ట్విటర్‌ హ్యాండిల్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అమరావతి సచివాలయంలో జనవరి 10న మధ్యాహ్నం భేటీ అవుతున్నామన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేర్ని నానికి ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ నడవబోతోందనేది ఇంట్రస్టింగ్‌గా మారింది. వర్మ సినిమా ఇండస్ట్రీ తరఫున ఏమేమి అంశాలు పేర్ని నాని దగ్గరికి తీసుకోబోతున్నారు? లేకపోతే.. ప్రముఖుల్ని ఎవర్నైనా తీసుకెళ్తారా? టికెట్ల విషయంలో ప్రభుత్వం స్పందించేలా ఏం చేయబోతున్నారనేది చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Faria Abdullah : వరుస ఆఫర్లు అందుకుంటున్న ముద్దుగుమ్మ.. మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన భామ..

Coronavirus: సినిమా తారలను పీడిస్తోన్న కరోనా.. హీరోయిన్ త్రిషకు కరోనా పాజిటివ్‌..

Amritha Aiyer: అమృత అయ్యర్ అందాల మెరుపులు.. ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తున్న లేటెస్ట్ ఫోటోస్

Suresh Productions: తెలుగులోకి ఆ సూపర్ హిట్.. అన్ని భాషల రీమేక్ హక్కులను సొంతం స్టార్ బ్యానర్..