Ram Charan: రామ్ చరణ్‌ చేతికి కట్టు! కారణమదేనా? నెట్టింట వైరల్ వీడియో

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగు లో బిజీగా ఉంటున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివన్న మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.

Ram Charan: రామ్ చరణ్‌ చేతికి కట్టు! కారణమదేనా? నెట్టింట వైరల్ వీడియో
Ram Charan

Updated on: Jun 27, 2025 | 6:25 AM

మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం (జూన్ 26) హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, సినిమా సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, రౌడీ బాయ్ విజయ దేవర కొండ కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. కార్యక్రమం చివరిలో భాగంగా అందరూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. అయితే ఈ సమయంలో రామ్ చరణ్ కొంచెం ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. అతని చేతికి కట్టు కూడా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులందరూ షాక్ అయ్యారు. అసలు రాంచరణ్ చేతికి ఏమైంది ఎందుకు అంత పెద్ద బ్యాండేజ్ వేశారు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. పెద్ది సినిమా షూటింగులో గ్లోబల్ స్టార్ గాయపడ్డాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే రామ్ చరణ్ గాయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పైగా ఈ గాయం పెద్దదేమీ కాదని స్పష్టమవుతుంది.

గగేమ్ ఛేంజర్ రిజల్ట్ తో నిరాశకు గురైన రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో బిజి బిజీగా ఉంటున్నాడు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి చెప్పిన టైమ్ కు రిలీజ్ చేసే యోచనలో ఉన్నాడీ మెగా హీరో. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందుకు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పెద్దిపై అంచనాలను అమాంతం పెంచేసింది.

ఇవి కూడా చదవండి

 యాంటీ డ్రగ్ అవేర్ నెస్ ప్రోగ్రామ్ లో సీఎం రేవంత్ రెడ్డి, రామ్ చరణ్.. వీడియో

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .