Ram Charan: చిరంజీవి కోసం పాటపాడిన చరణ్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన సాంగ్ ఇది..

రామ్ చరణ్.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న టాప్ హీరోల్లో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతను రెండో సినిమా మగధీరతోనే ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు. ఆ తర్వాత రంగస్థలం, ధ్రువ, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లోనూ నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఆర్ఆర్‌ఆర్‌తో గ్లోబల్ స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలు అందుకున్నాడు రామ్ చరణ్.

Ram Charan: చిరంజీవి కోసం పాటపాడిన చరణ్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన సాంగ్ ఇది..
Chiranjeevi, Ram Charan

Updated on: Jun 20, 2025 | 1:37 PM

చిరుత సినిమాతో హీరోగా పరిచయమైన రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు చరణ్. చాలా ఈజ్‌తో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. చిరంజీవి తనయుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. సినిమా సినిమాకు వైవిద్యం చూపుతూ.. మెగా పవర్ స్టార్ గా మారాడు రామ్ చరణ్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో అద్భుతంగా నటించి విమర్శకుల నోరు మూయించాడు. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నాడు.

ఎంత ఎదిగిన రామ్ చరణ్ చాలా వినయంగా ఉంటాడు. ఆ డిసిప్లేన్ అనేది తన తండ్రి దగ్గర నేర్చుకున్నా అని చాలా సందర్భాల్లో చెప్పారు చరణ్. అలాగే చరణ్ ఎదుగుదల చూసి మెగాస్టార్ ఎంతో గర్విస్తున్నారు. తనయుడు సాధిస్తున్న విజయాలు అందుకుంటున్న అవార్డులు చూసి మెగాస్టార్ మురిసిపోయిన సందర్భాలు చాలా ఉన్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి కోసం రామ్ చరణ్ పాట పాడిన విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.

ఇవి కూడా చదవండి

అవును చిరంజీవి కోసం రామ్ చరణ్ మొదటి సారి సింగర్ గా మారారు. చిరంజీవి ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ఆ పార్టీ కోసం రామ్ చరణ్ సింగర్ గా మారారు. పార్టీ కోసం మణిశర్మ సంగీతంలో చరణ్ ఓ పాటను పాడారు. ఈ పాటకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి హీరోగా నటించిన రాజా విక్రమార్క సినిమాలోని సాంగ్ ను ప్రజారాజ్యం కోసం రీమిక్స్ చేశారు. ఆ పాట అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. ఇదే సాంగ్ గతంలో చరణ్ రీమేక్ చేసి పాడారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.