శ్రీమ‌తికి చెర్రీ స్వీట్ బ‌ర్త్ డే విషెస్…

ఉపాస‌న..మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ జీవితంలోకి ప్ర‌వేశించాక అత‌డిని పూర్తిగా మార్చివేసింది. చెర్రీ.. వేష‌ధార‌ణ, న‌డ‌వ‌డిక‌, మాట్లాడే విధానం అన్నీ పూర్తిగా మారిపోయాయి. ఒక ప‌రిణితి చెందిన వ్య‌క్తిగా అత‌డు ఛేంజ్ అయ్యాడు.

శ్రీమ‌తికి చెర్రీ స్వీట్ బ‌ర్త్ డే విషెస్...

Updated on: Jul 20, 2020 | 4:13 PM

ఉపాస‌న..మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ జీవితంలోకి ప్ర‌వేశించాక అత‌డిని పూర్తిగా మార్చివేసింది. చెర్రీ.. వేష‌ధార‌ణ, న‌డ‌వ‌డిక‌, మాట్లాడే విధానం అన్నీ పూర్తిగా మారిపోయాయి. ఒక ప‌రిణితి చెందిన వ్య‌క్తిగా అత‌డు ఛేంజ్ అయ్యాడు. ఈ మార్పులో భార్యగా ఉపాస‌న పాత్ర సుస్ప‌ష్టం. కాగా నేడు చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న 31 ప‌డిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు సెల‌బ్రిటీలు ఆమెకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో చ‌ర‌ణ్..త‌న భార్య‌కు సంబంధించిన ఓ ఫోటో షేర్ చేసి.. “ద‌యగ‌ల మ‌న‌సుతో నువ్వు చేసే ప‌నులు ఎంత చిన్న‌వైన్ప‌టికీ.. వృధాకావు. రివార్డులు వ‌చ్చినా కూడా నీ ప‌నుల‌ని ఇలానే కొన‌సాగిస్తావ‌ని ఆశిస్తున్నాను..జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు” అంటూ పేర్కొన్నాడు.

ఉపాస‌న ఎప్పుడూ స‌మాజంలో మార్పు కోసం ప‌రిత‌పిస్తుంటుంది. ఆమె అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేయడం ద్వారా త‌న ప్ర‌త్యేక‌తను చాటుకుంటుంది. 2012 జూన్ 14న రామ్‌చ‌ర‌ణ్ ఉపాస‌న‌ను పెళ్లి చేసుకున్నారు. ఇటీవ‌లే వీరి వివాహ బంధానికి ఎనిమిదేళ్లు కంప్లీట్ అయ్యాయి. సామాజిక మాధ్య‌మాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఉపాస‌న భిన్న‌మైన పోస్టులు పెడుతూ నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షిస్తూ ఉంటుంది.