RRR Chennai Event: ఈరోజు సాయంత్రం చెన్నైలో RRR ఈవెంట్.. మొదలైన తమిళ తంబీల సందడి.. హోస్ట్‌గా తమిళ హీరో..

RRR Chennai Event: దక్షిణాది మెగా మల్టీస్టారర్ మూవీ.. మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్  సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో..

RRR Chennai Event: ఈరోజు సాయంత్రం చెన్నైలో RRR ఈవెంట్.. మొదలైన తమిళ తంబీల సందడి.. హోస్ట్‌గా తమిళ హీరో..
Chennai Rrr

Edited By:

Updated on: Dec 27, 2021 | 7:00 PM

RRR Chennai Event: దక్షిణాది మెగా మల్టీస్టారర్ మూవీ.. మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్  సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతోంది. బాహుబలి తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ దీంతో.. దేశ వ్యాప్తంగా ఈ మూవీ మీద భారీ హైప్‌ క్రియేట్ అయ్యింది. ఇక ఆ హైప్‌ను నెక్ట్స్ లెవల్‌ కు తీసుకెళ్లేందుకు విపరీతంగా కష్టపడుతున్నారు జక్కన్న తో పాటు చిత్ర బృందం.  ఈవెంట్స్ అండ్ ఇంటర్య్వూల్లో సందడి చేస్తూ.. ఆర్ఆర్ఆర్ పైభారీగా క్రేజ్ వచ్చేలా చేస్తున్నారు.

ఇప్పటికే ఉత్తరాదిలో చక్కర్లు కొట్టి ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ ను పీక్ లెవల్‌కు తీసుకెళ్లిన జక్కన్న అండ్ ఇజ్‌ హీరోస్…. తాజాగా దక్షిణాదికి షిప్ట్ అయ్యారు. తాజాగా చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. తమిళ తంబీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లైవ్ ఈవెంట్ ను తెలుగులో టీవీ9 ఎంటర్‌టైన్మెంట్ ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారం చేయనుంది.

ఇప్పటికే తమిళనాడులో ఈ వెంట్‌లో సందడి నెలకొంది. కోలీవుడ్‌లో ఉన్న చెర్రీ అండ్ తారక్‌ ఫ్యాన్స్ ఈ వెంట్‌కు తరలివచ్చేందుకు రెడీ కూడా అయ్యారు. ఇక లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఈ ఈవెంట్ కు తమిళ్ హీరో శివ కార్తికేయన్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇక ఈ న్యూస్‌ కూడా ప్రస్తుతం తమిళ నాట హాట్ టాపిక్ గా మారింది.

Also Read:  భార్యాభర్తలు సంతోషకరమైన జీవితం గడపాలంటే.. బెడ్ రూమ్‌లో ఈ వాస్తు చిట్కాలను పాటించండి..