RRR Movie: టాలీవుడ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోన్న ఆర్ఆర్ఆర్.. వెయ్యి కోట్లను దాటేస్తూ..

| Edited By: Anil kumar poka

Apr 09, 2022 | 6:44 PM

ఆర్ఆర్ఆర్ (RRR).. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకుపోతుంది.

RRR Movie: టాలీవుడ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోన్న ఆర్ఆర్ఆర్.. వెయ్యి కోట్లను దాటేస్తూ..
Rrr
Follow us on

ఆర్ఆర్ఆర్ (RRR).. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ విడుదలై రెండు వారాలు పూర్తైన కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో జనం నీరాజనం పలుకుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో గత రికార్డులన్నింటిని తిరగరాస్తూ ట్రిపుల్ ఆర్ ప్రభంజనం సృష్టిస్తోంది. తారక్, చరణ్ అద్భుతమైన నటన.. రాజమౌళి విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. నార్త్‏లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రిరాక్డ్స్ స్థాయిలో వసుళ్లూ రాబడుతూ దూసుకుపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. వెయ్యి కోట్లు రాబట్టింది ఆర్ఆర్ఆర్ మూవీ.

ట్రిపుల్ ఆర్ జోరు ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు… బాహుబలి రికార్డును బీట్ చేసే ఎయిమ్‌తో రంగంలోకి దిగిన ట్రిపుల్ ఆర్ … తాజాగా ఆ ఎయిమ్‌ను సగం రీచ్‌ అయిపోయి.. అతి తొందర్లో ఫినిష్ చేసే దిశగా పరుగెడుతోంది. తాజాగా వరల్డ్ వైడ్ థౌజెండ్‌ క్రోర్స్‌ వసూలు చేసి బాంబేలో సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేసుకున్న ఈ మూవీ టీం… తాజాగా థౌజెండ్‌ క్రోస్‌ ప్లెస్ … వసూళ్లను చాలా ఫాస్ట్ గా కమాయిస్తోంది. ఇక బాలీవుడ్ లో ఇప్పటికే 200 క్రోర్స్‌ వసూలు చేసిన ట్రిపుల్ ఆర్…ఈ సీజన్‌లో ఈ ఫీట్ చేసిన రెండో సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. క్రియేట్ చేయడమే కాదు… బాలీవుడ్ మేకర్స్ ను షాక్ చేసింది ట్రిపుల్ ఆర్.

Also Read: Bloody Mary: బ్లడీ మేరీ మేకింగ్ వీడియో రిలీజ్.. అంధురాలిగా నివేదా పేతురాజ్..

Salaar: ఫ్యాన్స్‏కు డబుల్ ట్రీట్ ఇవ్వనున్న ప్రశాంత్ నీల్.. సలార్ నుంచి గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా ?..

Manchu Vishnu: సన్నీ లియోన్‏ను చూసి భయపడి పారిపోయిన మంచు విష్ణు.. నెట్టింట్లో వైరలవుతున్న వీడియో..

Akira Nandan: అకీరాకు బర్త్ డే విషెస్ చెబుతూ స్పెషల్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్..