మరో గుర్తుండిపోయే ఐకానిక్ రోల్‏లో రామ్ చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ సినిమాలో సరికొత్త లుక్..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఫుల్ బిజీగా

మరో గుర్తుండిపోయే ఐకానిక్ రోల్‏లో రామ్ చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ సినిమాలో సరికొత్త లుక్..
Ram Charan

Updated on: Jun 01, 2021 | 5:55 PM

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ తోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ప్రధాన పాత్రలో చేస్తుండగా.. అలియా భట్, ఓలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో చిత్రీకరిస్తుండగా.. రామ్ చరణ్ ఇందులో అల్లూర సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. అటు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తన తదుపరి మూవీ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వీరిద్ధరి కాంబోలో రాబోతున్న సినిమాపై ఇప్పటినుంచే అనేక రకాల రూమార్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఇప్పటివరకు చరణ్ పోషించిన పాత్రలకంటే.. శంకర్ సినిమాలో చేయబోయే రోల్ ఎప్పటికీ గుర్తిండిపోయే పాత్రగా నిలవబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ సినిమా కోసం చరణ్ స్పెషల్ మేకోవర్ లోకి మారబోతున్నారని సమాచారం. మరో రెండు నెలల్లో చరణ్ పూర్తిగా సరికొత్త లుక్ లోకి సిద్ధం కాబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు చరణ్ మగధీర, రంగస్థలం సినిమాల్లో చేసిన పాత్రలకు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే ఇప్పుడు చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో చేస్తున్న అల్లూరి సీతారామారాజు పాత్ర కూడా తన కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచిపోనుంది. మరీ రాబోయే సినిమాలో శంకర్ చరణ్ ను ఎలాంటి ఐకానిక్ పాత్రలో చూపించనున్నారో చూడాలి.

Also Read: పుష్ప సినిమాలో తరుణ్ ?.. స్టైలీష్ స్టార్ సినిమాలో భాగం కానున్న ఒకప్పటి లవర్ బాయ్…

టైప్ చేసే అక్షరాలకు ఎమోషన్స్ ఉండవు.. రాసే ప్రతి అక్షరానికి ఫీలింగ్ ఉంటుంది.. ఇంట్రెస్టింగ్‏గా 18 Pages ఫస్ట్‏లుక్ పోస్టర్..

Karan Mehra: పాపులర్ టీవీ యాక్టర్ కరణ్ మెహ్రా అరెస్ట్.. తనను కొట్టాడంటూ భార్య ఫిర్యాదు.. ఆ వెంటనే..