AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుష్ప సినిమాలో తరుణ్ ?.. స్టైలీష్ స్టార్ సినిమాలో భాగం కానున్న ఒకప్పటి లవర్ బాయ్…

Pushpa Movie: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‏లో తెరకెక్కుతున్న సినిమా 'పుష్ప'.

పుష్ప సినిమాలో తరుణ్ ?.. స్టైలీష్ స్టార్ సినిమాలో భాగం కానున్న ఒకప్పటి లవర్ బాయ్...
Tarun
Rajitha Chanti
|

Updated on: Jun 01, 2021 | 5:39 PM

Share

Pushpa Movie: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‏లో తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ప’. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో బన్నీ పూర్తిగా డీ గ్లామరస్ పాత్రలో కనిపించబోతుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ రికార్డ్స్ సృష్టిస్తుంది. అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు గాసిప్స్ స్ర్పెడ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.

పుష్ప సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ కూడా భాగం కాబోతున్నాడని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంబించిన తరుణ్.. నువ్వే కావాలి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. పాతికేళ్ల వయసులోనే సూపర్ హిట్ అందుకున్న తరుణ్.. లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత తరుణ్.. ‘నువ్వులేక నేను లేను’ ‘నువ్వే నువ్వే’ ‘ప్రియమైన నీకు’ ‘ఎలా చెప్పను’ ‘నీ మనసు నాకు తెలుసు’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక ఆ తర్వాత కథల ఎంపికలో పొరపాట్లు చేయడంతో తరుణ్ కెరీర్ మెల్లగా డీలా పడిపోయింది. దీంతో సినిమాలకు దూరంగా ఉంటూ.. బిజినెస్ వైపు దృష్టి సారించాడు. అటు వ్యాపారవేత్తగా రాణిస్తూనే.. ఇటు డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టాడు తరుణ్. ఫహాద్ ఫాజిల్ – సాయి పల్లవి జంటగా నటించిన ‘అనుకోని అతిథి’ సినిమా ఇటీవలే ఆహా ఓటీటీలో విడుదలైంది. ఇందులో ఫహాద్ కు తరుణ్ డబ్బింగ్ చెప్పాడు. ఇప్పుడు ‘పుష్ప’ లో విలన్ రోల్ లో నటిస్తున్న ఫహాద్ కు తరుణ్ చేతనే డబ్బింగ్ చెప్పించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ‘అనుకోని అతిథి’ సినిమాలో పాత్రకు సెట్ అయినట్లు తన వాయిస్ విలన్ పాత్రకు సూట్ అవుతుందో లేదో చూడాలి.

Also Read: మహేష్- త్రివిక్రమ్ సినిమా పై క్రేజీ అప్‍డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పటి నుంచే..

టైప్ చేసే అక్షరాలకు ఎమోషన్స్ ఉండవు.. రాసే ప్రతి అక్షరానికి ఫీలింగ్ ఉంటుంది.. ఇంట్రెస్టింగ్‏గా 18 Pages ఫస్ట్‏లుక్ పోస్టర్..

వాంఖడే సాక్షిగా చరిత్ర సృష్టించిన సూర్య..కోహ్లీ రికార్డ్ బ్రేక్
వాంఖడే సాక్షిగా చరిత్ర సృష్టించిన సూర్య..కోహ్లీ రికార్డ్ బ్రేక్
మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!
మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!
వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!
వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం
ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే
ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్
ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్
టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?
టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!
హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!
హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!
కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ చేశారట..!
కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ చేశారట..!