Game Changer: జెట్ స్పీడ్‌లో గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్.. అస్సలు తగ్గేదే లే అంటున్న రామ్ చరణ్..

|

Jan 04, 2025 | 11:49 AM

గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్‌లో మరింత జోరు పెంచేస్తున్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా మెగా సినిమా కాబట్టి.. ఆ మాత్రం మెగా జోష్ ఉండేలా కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తున్నారు. మరి అవేంటి..? ఇంతకీ గేమ్ ఛేంజర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి..?

Game Changer: జెట్ స్పీడ్‌లో గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్.. అస్సలు తగ్గేదే లే అంటున్న రామ్ చరణ్..
Game Changer
Follow us on

గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లో జోరు పెరుగుతుంది. రిలీజ్‌కు ముందు భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒకటి రెండు కాదు.. భారీ వేడుకలు చేయబోతున్నారు. ఇప్పటికే లక్నోలో టీజర్ లాంఛ్.. అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.. హైదరాబాద్‌లో ట్రైలర్ లాంఛ్ చేసారు. తాజాగా పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాజమండ్రిలో మరికాసేపట్లోనే మెగా పవర్ ఈవెంట్ జరగనుంది.

ఇది కూడా చదవండి : దిమ్మతిరిగింది సామి..! ఈ టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్స్.. ప్రభాస్ ఫ్రెండ్ సిస్టర్సా..!!

డిసెంబర్ 29న రామ్ చరణ్ బిగ్గెస్ట్ కటౌట్ లాంఛ్ జరిగింది. విజయవాడలో 256 ఫీట్లతో కటౌట్ ఏర్పాటు చేసారు. దీనికి ముఖ్య అతిథిగా తమన్ వచ్చారు. అలాగే ముంబై, చెన్నైలలోనూ త్వరలోనే ఈవెంట్స్ ఉంటాయని టాక్ వినిపిస్తుంది. చెన్నైలో జరగబోయే ఈవెంట్‌కు విజయ్, రజినీకాంత్‌లను చీఫ్ గెస్టులుగా ఆహ్వానించబోతున్నారు. రాజమండ్రి ఈవెంట్‌కు అభిమానులు భారీగా వస్తున్నారు. డిప్యూటీ సిఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ హాజరు కానున్న మొదటి ఈవెంట్ ఇదే. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. గతంలో రంగస్థలం విజయోత్సవానికి పవన్ వచ్చారు. అప్పట్లో నాయక్ వేడుకలోనూ కనిపించారు. మళ్లీ బాబాయ్ అబ్బాయి కలిస్తే అభిమానులకు ఫుల్ మీల్స్ పక్కా.

ఇది కూడా చదవండి : Kanchana 4: దెయ్యంగా భయపెట్టనున్న హాట్ బ్యూటీ.. కాంచన 4లో ఆ క్రేజీ భామ

అలాగే  పాన్ ఇండియన్ సినిమా చేసినపుడు.. దాని ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలోనే ఉండాలి. ఏ మాత్రం తగ్గినా.. ఆడియన్స్ దగ్గర మాట వచ్చేస్తుంది. అందుకే తగ్గేదే లే అంటున్నారు మన హీరోలు. తాజాగా గేమ్ ఛేంజర్ కోసం ఒళ్లు హూనం చేసుకుంటున్నారు రామ్ చరణ్. దేశమంతా సుడిగాలి పర్యటనకు సిద్ధమవుతున్నారు మెగా వారసుడు.
ప్రమోషన్స్ విషయంలో తగ్గేదే లే అంటున్నారు మన హీరోలు. ముఖ్యంగా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేసినపుడు.. ప్రమోషన్ కూడా అలాగే ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2కు దేశంలోని 5 ప్రధాన నగరాల్లో ఈవెంట్స్ చేసారు. సేమ్ 2 సేమ్ గేమ్ ఛేంజర్‌కు ఇదే చేయబోతున్నారు. ఢిల్లీ, చెన్నై, కొచ్చి, ముంబైల్లో గేమ్ ఛేంజర్ ఈవెంట్స్ ఉండబోతున్నాయి. గేమ్ ఛేంజర్ టీజర్ లాంఛ్ లక్నోలో జరిగింది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో చేసారు. అక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విజయవాడలో కటౌట్ లాంఛ్ చేసారు. రాజమండ్రిలో మెగా పవర్ ఈవెంట్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ట్రైలర్ లాంఛ్ జరిగింది. ఇక చెన్నై, కొచ్చి, ముంబై బ్యాలెన్స్ ఉన్నాయి. దేశంలో జరగబోయే ప్రతీ ఈవెంట్‌కు రామ్ చరణ్ వెళ్లనున్నారు. చెన్నైలో శంకర్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ మరింత భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ వరకు నాన్ స్టాప్ ప్రమోషనల్ ప్లానింగ్ రెడీగా ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే తరువాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి