Ram Charan: మెగాస్టార్ 45 ఏళ్ల సినీ ప్రస్థానం.. రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..

రు పదుల వయసులోనూ కుర్ర హీరోలను గట్టి పోటీనిస్తూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఎంతో మంది నటీనటులకు ఆయనే ఆదర్శం. కొత్తవారిని ఎంకరేజ్ చేయడంలోనూ...అలాగే ఇటు సినిమాలతో పాటు అటు సామాజిక సేవలోనూ ముందుంటారు చిరు. మెగాస్టార్ హీరోగా నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు మూవీ విడుదలై నేటికి 45 సంవత్సరాలు.

Ram Charan: మెగాస్టార్ 45 ఏళ్ల సినీ ప్రస్థానం.. రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
Ram Charan, Megastar Chiran

Updated on: Sep 22, 2023 | 6:22 PM

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మందికి స్పూర్తి. ప్రాణం ఖరీదు సినిమాతో హీరోగా మొదలైన ప్రయాణం.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. సహజ నటన.. ఆయన డాన్స్… ఫైట్స్.. యాక్షన్ అయినా.. ఫ్యామిలీ అయినా.. లవ్ స్టోరీ అయినా అన్ని జోనర్స్‏లోనూ తనదైన మార్క్ వేసి మెగాస్టార్ అయ్యారు చిరు. అప్పట్లో ఆయన సినిమా వచ్చిందంటే.. బాక్సాఫీస్ వద్ద జాతర జరిగేది. ఇక ఇప్పటికీ థియేటర్లలో ఆ జోరు కొనసాగిస్తున్నారు చిరు. ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలను గట్టి పోటీనిస్తూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఎంతో మంది నటీనటులకు ఆయనే ఆదర్శం. కొత్తవారిని ఎంకరేజ్ చేయడంలోనూ…అలాగే ఇటు సినిమాలతో పాటు అటు సామాజిక సేవలోనూ ముందుంటారు చిరు. మెగాస్టార్ హీరోగా నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు మూవీ విడుదలై నేటికి 45 సంవత్సరాలు.

22 సెప్టెంబర్ 1978లో చిరు నటించిన ప్రాణం ఖరీదు సినిమా థియేటర్లలో విడుదలైంది. నేటితో ఈ మూవీ రిలీజ్ అయి 45 సంవత్సరాల అవుతుండడంతో అభిమానులు, సినీ ప్రముఖులు చిరుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం తన తండ్రి చిరంజీవి 45 ఏళ్ల సినీ ప్రస్తానంపై ఎమోషనల్ ట్వీట్ చేశారు.

“మన ప్రియతమ మెగాస్టార్‌కి హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే.. ఆయన 45 సంవత్సరాల మెగా జర్నీని పూర్తి చేసుకున్నారు కాబట్టి. ప్రాణం ఖరీదు సినిమాతో అద్భుతమైన సినీ ప్రయాణం ప్రారంభించి.. ఇప్పటికీ మీ అబ్బురపరిచే ప్రదర్శనలతో కొనసాగుతోంది. మీరు స్క్రీన్ మీ నటనతో, స్క్రీన్ బయట సేవా కార్యకలాపాలతో మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. క్రమశిక్షణ, కృషి, అంకితభావం, శ్రేష్ఠత.. అన్నింటికంటే ముఖ్యంగా కరుణ వంటి విలువలను మాలో నింపినందుకు నాన్నగారికి ధన్యవాదాలు.” అంటూ ట్వీట్ చేస్తూ మెగాస్టార్ ప్రత్యేక ఫోటో షేర్ చేశారు. చరణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుండడంతో సినీ ప్రముఖులు, అభిమానులు చిరుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Ram Charan , Ram Charan movies, Ram Charan news, Ram Charan films, Ram Charan telugu, Megastar Chiranjeevi , Megastar Chiranjeevi news, Megastar Chiranjeevi movies, Megastar Chiranjeevi 45 years,