Ram Charan: సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశా.. ఆసక్తికర విషయం చెప్పిన చరణ్
ఈ వేడుకల్లో నందమూరి కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.ఇక ఎన్టీఆర్ కుటుంబసభ్యులో.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే బాలకృష్ణ, పురందేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, వసుంధర, బ్రహ్మాణి, దేవాన్ష్ హాజరయ్యారు.

సినీ దిగ్గజం.. తెలుగు ప్రజల అన్నగారు.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లోని కైత్లాపూర్ గ్రౌండ్‌లో శనివారం ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో నందమూరి కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.ఇక ఎన్టీఆర్ కుటుంబసభ్యులో.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే బాలకృష్ణ, పురందేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, వసుంధర, బ్రహ్మాణి, దేవాన్ష్ హాజరయ్యారు. వీరితోపాటు రాజకీయ ప్రముఖులు సీతారాం ఏచూరి, డి.రాజా, సినీ ప్రముఖులు వెంకటేశ్, జయప్రద, జయసుధ, మురళీ మోహన్, రామ్ చరణ్, బాబు మోహన్, విజయేంద్ర ప్రసాద్, అల్లు అరవింద్, అశ్వినీదత్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, అనిల్ రావిపూడి, శ్రీలీలతోపాటు కన్నడ నటుడు శివరాజ్‌కుమార్, నాగచైతన్య, సుమంత్, సిద్ధు జొన్నలగడ్డ, అడివిశేష్ వంటి పలువురు సినీ తారలు ఈ వేడుకలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసే అదృష్టం కలిగిందని ఆసక్తికర విషయాన్నీ పంచుకున్నారు. పురందేశ్వరి గారి కొడుకు నేను మంచి స్నేహితలం.. నా చిన్నప్పుడు ఒకసారి ఉదయం 6 గంటల సమయంలో ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్ళాను. ఆ సమయంలో అందరు అన్నట్టుగానే ఆయన చికెన్ వేసుకొని బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు.
జిమ్ వర్కౌట్స్ పూర్తి చేసుకొని బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఎన్టీఆర్ గారు నన్ను చూసి రా.. వచ్చి కూర్చొని బ్రేక్ ఫాస్ట్ చెయ్యామన్నారు. అలా ఆయనతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసే అదృష్టం కలిగింది అని తెలిపారు. తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మేటి మహనీయుడు ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ పై ప్రేమ కురిపించారు చరణ్.
