మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సంబరాలు యేటి గట్టు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైనా సాయి ధరమ్ తేజ్ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు తేజ్. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు తేజ్. తాజాగా సంబరాల యేటి గట్టు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ టీజర్ ను విడుదల చేశారు. కాగా టీజర్ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు. సాయి ధరమ్ తేజ యాక్సిడెంట్ రోజులను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు రామ్ చరణ్..
రామ్ చరణ్ మాట్లాడుతూ.. “పదేళ్లు పూర్తి చేసుకున్న తేజ్ కు అభినందనలు. తేజ్ మంచి వ్యక్తి.. తేజ్ మంచి గుణం ఉన్న వ్యక్తి. రేయ్ సినిమా నుంచి అద్భుతమైన జర్నీ చేశాడు. చాలా కష్టపడతాడు. మీ అందరి సపోర్ట్ వల్లే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. నేను ఎక్కడా ఇది మాట్లాడలేదు.. ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా.. తేజు ఈ రోజు ఇలా మీ ముందు నుంచున్నాడంటే మీ అందరి ఆశీర్వాదాల వల్లే అన్నారు రామ్ చరణ్. ఆ రోజును నేను మళ్లీ గుర్తు తెచ్చుకోవాలని అనుకోవడం లేదు కానీ ఇది తేజ్ కు పునర్జన్మ.. అది ఇచ్చింది మీరే”.. అన్నారు చరణ్.
అలాగే తేజ్ కు యాక్సిడెంట్ అయిన రోజున మేము చాలా భయపడ్డాము. అది మాటల్లో చెప్పలేం. గుండెను చేత్తో పట్టుకొని మూడు నెలలు ఉన్నాం.. చాలా కష్టమైనా సమయం అది అంటూ ఎమోషనల్ అయ్యారు చరణ్. అలాగే సంబరాల యేటి గట్టు సినిమా గురించి మాట్లాడుతూ.. తేజ్ ఊచకోత ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు అని అన్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని అన్నారు. చివరలో తేజ్ ప్రేమ బండ ప్రేమ అది ఒక్కసారి పట్టుకునే వదలడు. అది మగాళ్ల మీదే కాదు అమ్మాయిల మీద కూడా చూపించాలి.. పెద్దవాడివి అయ్యావు పెళ్లి కూడా చేసుకో అని సరదా గా అన్నారు రామ్ చరణ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.