Ram Charan : చెర్రీ క్రేజ్ మాములుగా లేదుగా.. నాటు స్టెప్పుతో స్టేడియాన్నే ఊపేసిన మెగా హీరో.. చూస్తుండిపోయిన సచిన్, రవిశాస్త్రి

ప్రస్తుతం చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో ఇప్పుడు అందరి చూపు ఈ మూవీ పైనే. అంతేకాకుండా ఇందులో తొలిసారి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చుద్దామా అని ఆత్రుతగా ఉన్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. ఇటీవలే చరణ్ క్రికెట్ లీగ్‏లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

Ram Charan : చెర్రీ క్రేజ్ మాములుగా లేదుగా.. నాటు స్టెప్పుతో స్టేడియాన్నే ఊపేసిన మెగా హీరో.. చూస్తుండిపోయిన సచిన్, రవిశాస్త్రి
Ram Charan

Updated on: Mar 06, 2024 | 4:51 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ మేకర్స్‏ను సైతం ఫిదా చేసిన చెర్రీ క్రేజ్ రోజు రోజుకీ మరింత పెరిగిపోతుంది. ఆయన సినిమాల కోసం వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో ఇప్పుడు అందరి చూపు ఈ మూవీ పైనే. అంతేకాకుండా ఇందులో తొలిసారి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చుద్దామా అని ఆత్రుతగా ఉన్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. ఇటీవలే చరణ్ క్రికెట్ లీగ్‏లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసినట్లు చరణ్ గతంలోనే ప్రకటించారు. టెన్నిస్ బాల్‏తో నిర్వహించే ఐఎస్పీఎల్ లీగ్‏లో హైదరాబాద్ టీంకు యజమానిగా ఉన్నారు చరణ్. క్రికెట్ ఆడాలని ఉండే గల్లీ ప్లేయర్స్ తన టీంలో చేరొచ్చు అంటూ అప్పుడే అనౌన్స్ చేశారు చరణ్. ఇక ఈ క్రికెట్ లీగ్ లో సూర్య, అక్షయ్ కుమార్ కూడా పలు టీంలకు యాజమానులుగా ఉన్నారు. తాజాగా ఐఎస్పీఎల్ టీ10 లీగ్ మహారాష్ట్రలోని థానేలో ప్రారంభమయ్యింది. దడోజి కోనదేవ్ స్టేడియంలో ఈరోజు జరిగిన ప్రారంభ వేడుకల్లో మెగా హీరో రామ్ చరణ్, సచిన్ టెండుల్కర్, రవిశాస్త్రి, కోలీవుడ్ స్టార్ సూర్య పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

అయితే క్రికెట్ స్టేడియంలో మాత్రం చరణ్ క్రేజ్ ఓ రేంజ్ లో మారుమోగింది. ఆయనతో కలిసి డాన్స్ చేసేందుకు చీర్ లీడర్స్ ఆసక్తి చూపించారు. దీంతో వారితో కలిసి నాటు నాటు పాటకు కాలు కదిపారు చరణ్. ఆయన డాన్స్ చేస్తుండగా.. రవిశాస్త్రి, సచిన్ చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత చెర్రీకి స్వాగతం పలికారు వీరిద్దరు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇటీవల జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లతో కలిసి నాటు నాటు స్టెప్పుకు డాన్స్ చేశారు చరణ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.