AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie: వీక్‌డేస్‌లోనూ అదరగొట్టిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ఐదు రోజుల్లో మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయంటే?

వీకెండ్ లో దుమ్మురేపిన 'పెద్ది' సినిమా మండే కాస్త నెమ్మదించింది. కానీ ఊహించిన దానికంటే మంచి వసూళ్లనే సాధించింది. సోమవారం (జూన్ 09) రూ. 300 క్లబ్ లో చేరిన పెద్ది సినిమా ఐదు రోజుల కలెక్షన్ల వివరాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Peddi Movie: వీక్‌డేస్‌లోనూ అదరగొట్టిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఐదు రోజుల్లో మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Peddi Movie
Basha Shek
|

Updated on: Jun 09, 2026 | 11:30 AM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుడూ మెగా పవర్ స్టామినాను మరో సారి ప్రూవ్ చేస్తోంది. మొదటి రోజు రూ.130 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ మెగా మూవీ సోమవారం (జూన్ 09) రూ. 300 కోట్ల క్లబ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఓవరాల్ గా ఐదు రోజులకు కలిపి మొత్తం 315 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర బృందం పేర్కొంది. వీక్ డేస్ అయినా సోమవారం ఒక్కరోజే ఈ సినిమాకు 22.5 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మేరకు బాక్సాఫీస్ ఛాంపియన్ పెద్ది ర్యాంపేజ్ అంటూ సోషల్ మీడియా వేదికగా కలెక్షన్ల పోస్టర్ ను షేర్ చేసింది పెద్ది యూనిట్. అటు ఓవర్సీస్ లోనూ పెద్ది సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో రామ్ చరణ్ సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి. ఇప్పటికే అక్కడ 3 మిలియన్ల డాలర్లను సాధించినట్లు తెలుస్తోంది. ఇక వీక్ డేస్ లోనూ పెద్ది సినిమా టికెట్లు భారీగా బుకింగ్ అవుతున్నాయి. మై బుక్ షో, డిస్ట్రిక్ అలోన్ యాప్స్ లో ఇప్పటివరకు 5.3 మిలియన్స్ టికెట్స్ బుక్ అయినట్లు పెద్ది చిత్ర బృందం పేర్కొంది.

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కించిన పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే శివరాజ్ కుమార్ జగపతిబాబు, దివ్యేందు త్రిపాఠి, రావు రమేష్, బొమన్ ఇరానీ, రవి కిషన్, కమెడియన్ సత్య, చమ్మక్ చంద్ర, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

ఐదు రోజుల్లో రూ. 315 కోట్లు…

పెద్ది సినిమా చూసిన అల్లు అర్జున్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us