RRR: విడుదలకు ముందే రికార్డ్స్ వేట షూరు.. ఆర్ఆర్ఆర్ ప్రీమియర్స్ కలెక్షన్స్ సునామీ..

| Edited By: Anil kumar poka

Mar 20, 2022 | 3:55 PM

యావత్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ (RRR). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న

RRR: విడుదలకు ముందే రికార్డ్స్ వేట షూరు.. ఆర్ఆర్ఆర్ ప్రీమియర్స్ కలెక్షన్స్ సునామీ..
Rrr
Follow us on

యావత్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ (RRR). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.. చెర్రీ.. తారక్‏ల స్నేహబంధాన్ని వెండితెరపై చూసేందుకు మెగా.. నందమూరి అభిమానులు ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులను ఒక తెరపై స్నేహితులుగా చూపించబోతున్నారు జక్కన్న. ఇందులో చరణ్ అల్లూరి సీతారామారాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్.. అలియా భట్.. శ్రియా సరన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా.. కరోనా కేసులు పెరుగడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఇప్పుడు ఈ సినిమా మరో 5 రోజుల్లో అంటే మార్చి 25న పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు జక్కన్న అండ్ టీం.

ఈ క్రమంలో రాజమౌళి.. రామారావు.. రామ్ చరణ్.. ట్రిపుల్ ఆర్ కాంబినేషన్ కొత్త రికార్డుల వేట షురూ చేసింది.. ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఓవర్ సీస్ ఆర్ఆర్ఆర్ ప్రీమియర్స్ కలెక్షన్స్ ఇప్పటికే రెండు మిలియన్స్ క్రాస్ చేసిందట. దాదాపు మూడు మిలియన్ డాలర్స్‏కు చేరువలో ఉందని టాక్. ఇక విడుదల సమయానికి మూడు మిలియన్స్ క్రాస్ చేయడం ఖాయమంటున్నారు సీని విశ్లేషులు.. అంటే… కేవలం ప్రీమియర్స్ పరంగా ఇప్పటికీ రూ. 20 కోట్లు వసూళ్లు రాబట్టినట్టుగా తెలుస్తోంది.. విడుదలకు ముందే ఆర్ఆర్ఆర్ ప్రీమియర్స్ కలెక్షన్స్ ఈ స్థాయిలో రాబట్టడం ఫస్ట్ రికార్డ్.. ఈ రికార్డ్ సాధించిన తొలి సినిమా కూడా ఆర్ఆర్ఆర్ కావడం విశేషం.

అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రాన్ని డీవీనీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్‏తో నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్స్.. సాంగ్స్ సోషల్ మీడియాలో రికార్డ్స్ సృష్టించాయి.. ఇక ఇటీవల విడుదలైన ఎత్తర జెండా సాంగ్ యూట్యూబ్‍ను షేక్ చేస్తోంది.

Also Read: RRR-Ram Charan: మన మధ్య లేడంటే నమ్మాలని లేదు.. ఇక్కడే ఉన్నారనిపిస్తోంది.. రామ్ చరణ్ 

భావోద్వేగ కామెంట్స్.. 

Samantha: సమంత సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్.. యశోద షూటింగ్ సెట్స్‏లో..

RRR-Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్.. నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలంటూ..

Knee Pain: మోకాళ్లు.. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా ?.. అయితే ఈ ఆకులతో చెక్ పెట్టొచ్చు..