Rakul Preet Singh – Jackky Bhagnani: ‘నువ్వు నేను కాదు.. ఇక పై మనం’.. రకుల్, జాకీ పెళ్లి వీడియో చూశారా ?..

|

Feb 23, 2024 | 3:05 PM

వీరి పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సినీ ప్రమఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక నిన్న గురువారం ప్రధాని నరేంద్ర మోదీ రకుల్, జాకీ జంటకు విషెస్ తెలుపుతూ పీఎంఓ ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా నోట్ షేర్ చేశారు. దీంతో ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ పీఎంఓ ఆఫీస్ లేఖను నెట్టింట పంచుకుంది రకుల్. తాజాగా తమ పెళ్లికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ తన భర్తపై ప్రేమను కురిపించింది రకుల్.

Rakul Preet Singh - Jackky Bhagnani: నువ్వు నేను కాదు.. ఇక పై మనం.. రకుల్, జాకీ పెళ్లి వీడియో చూశారా ?..
Rakul, Jackky
Follow us on

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహం ఈనెల 21న జరిగిన సంగతి తెలిసిందే. బుధవారం గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్‏లో తన ప్రియుడు బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సెలబ్రెటీలు హాజరయ్యి నూతన వధూవరులను దీవించారు. వీరి పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సినీ ప్రమఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక నిన్న గురువారం ప్రధాని నరేంద్ర మోదీ రకుల్, జాకీ జంటకు విషెస్ తెలుపుతూ పీఎంఓ ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా నోట్ షేర్ చేశారు. దీంతో ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ పీఎంఓ ఆఫీస్ లేఖను నెట్టింట పంచుకుంది రకుల్. తాజాగా తమ పెళ్లికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ తన భర్తపై ప్రేమను కురిపించింది రకుల్.

మెహందీ, హల్దీ వేడుకల నుంచి పెళ్లిలో గడిపిన ఆరాధ్య క్షణాలను అన్నింటిని కలిపి ఓ అందమైన వీడియో షేర్ చేసింది. ఓ సినిమా కోసం చేసిన సాంగ్ మాదిరిగా రకుల్, జాకీ పెళ్లి వీడియోను డిజైన్ చేశారు. లైట్ పింక్ లెహంగాలో డాన్స్ చేస్తూ వివాహ వేదికపైకి ఎంట్రీ ఇచ్చింది రకుల్. అలాగే నీలిరంగు లెహంగాలో హల్దీ వేడుకలలో ఎంతో సరదాగా సందడి చేసింది. తమ పెళ్లి వీడియోను షేర్ చేస్తూ.. ‘నువ్వు నేను కాదు.. ఇక పై మనం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది రకుల్. ఇక వీరి పెళ్లి వీడియోలో వినిపిస్తున్న మనోహరమైన మెలోడి పాటను తనిష్క్ బాగ్చి స్వరపరిచారు. ఈ పాటను జరా ఖాన్, తనిష్క్ కలిసి పాడారు. రకుల్, జాకీ పెళ్లి సిక్కు, సింథీ సంప్రదాయాల ప్రకారం రెండు వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది.

వీరిద్దరి వివాహ దుస్తులను డిజైనర్ తరుణ్ తహిలియా డిజైన్ చేశారు. పింక్ పీచ్ లెహంగా.. అందుకు తగిన వజ్రాల ఆభరణాలను ధరించింది రకుల్. ఇక జాకీ మాత్రం క్లిష్టమైన చినార్ మోటిఫ్ ను కలిగి ఉన్న ఐవరీ చికంకారీ షేర్వాణిని ధరించాడు. వీరి పెళ్లి గురించి చాలా రోజులుగా అనేక రూమర్స్ చక్కర్లు కొట్టాయి. నిజానికి వీరు తమ వివాహాన్ని మల్దీవులలో ప్లాన్ చేసుకున్నారు. కానీ ప్రధాని మోదీ మన దేశ టూరిజం గురించి మాట్లాడడంతో తమ నిర్ణయాన్ని మార్చుకుని గోవాలోని బీచ్ రిసార్ట్ లో వివాహం చేసుకున్నారు. రకుల్ పెళ్లి వేడుకకు టాలీవుడ్ నుంచి ఎవరు వెళ్లినట్లుగా కనిపించలేదు. కేవలం మంచు లక్ష్మి ఈ వేడుకలలో సందడి చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.