ఆ హీరో కోసం పిచ్చెక్కిపోతున్న రకుల్ .. మనసులో క్రష్ అతడిమీదేనట..

ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్ అనేది జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధురానుభూతి. అలాంటి క్రష్‌లు మని ఫిల్మ్ ఇండస్ట్రీలో కామన్‌ అనే విషయం పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. హీరోలు మారుతుంటారు, హీరోయిన్స్ కూడా మారిపోతూనే ఉంటారు. అయితే ఎవరైన ఒక హీరోకి తనకు నచ్చిన హీరోయిన్‌తో రొమాన్స్ చేయాలని, లేక వారితో కలిసి నటించాలని ఆశపడటం సహజంగానే ఉంటుంది. ఇలాంటివి ఇండస్ట్రీలో సర్వసాధారణమే. టాలీవుడు, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడాలేకుండా ఫుల్‌ బిజీగా ఉన్న అందాల రకుల్ […]

ఆ హీరో కోసం పిచ్చెక్కిపోతున్న రకుల్ .. మనసులో క్రష్ అతడిమీదేనట..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Sep 29, 2019 | 4:14 PM

ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్ అనేది జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధురానుభూతి. అలాంటి క్రష్‌లు మని ఫిల్మ్ ఇండస్ట్రీలో కామన్‌ అనే విషయం పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. హీరోలు మారుతుంటారు, హీరోయిన్స్ కూడా మారిపోతూనే ఉంటారు. అయితే ఎవరైన ఒక హీరోకి తనకు నచ్చిన హీరోయిన్‌తో రొమాన్స్ చేయాలని, లేక వారితో కలిసి నటించాలని ఆశపడటం సహజంగానే ఉంటుంది. ఇలాంటివి ఇండస్ట్రీలో సర్వసాధారణమే.

టాలీవుడు, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడాలేకుండా ఫుల్‌ బిజీగా ఉన్న అందాల రకుల్ మనసు కూడా క్రష్ అయ్యిందట. ఇంతకీ ఎందుకో తెలుసా? తెలుగులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో స్టార్టయిన ఫిల్మ్ జర్నీలో ఇప్పటివరకు చాల మంది హీరోలతో కలిసి నటించింది రకుల్. అయితే ఇంతవరకు తన మదిలో దాగున్న మాటలను ఒక్కసారైన బయటపెట్టలేదు. కానీ మంచు లక్ష్మి చేస్తున్న లేటెస్ట్ టాక్ ‌షో ఫీట్ అప్ విత్ ది స్టార్స్ కార్యక్రమంలో గెస్ట్‌గా వచ్చిన రకుల్ తన ఇన్నర్ ఫీలింగ్‌ని ఇంతకాలానికి బయటపెట్టిందట. ఇంతకీ అదేమిటంటే నీకు సెలబ్రిటీల్లో ఎవరైనా క్రష్ ఉన్నారా? అని ప్రశ్నించిన లక్ష్మికి షాక్ అయ్యే రిప్లై ఇచ్చిందట రకుల్. అదేమిటంటే టాలీవుడ్‌లో మన హీరో విజయ్ దేవరకొండ అంటే చాల ఇష్టమని చెప్పేసిందట. రకుల్ చెప్పిన ఆన్సర్ విని మంచు లక్ష్మి నిజంగానే షాకైందట.

రకుల్ ప్రీత్‌సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో మర్జవా చిత్రంలో నటిస్తున్నారు. ఆమెతో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా, రితేశ్ దేశముఖ్, తారా సుతారియా కూడా ఈమూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ విడుదలై సంచలనం రేపుతోంది. ఈ వూవీలో రకుల్ ఓ స్పెషల్ సాంగ్ డాన్స్ చేస్తూ కనిపించింది.