Rakul Preet Singh: శాంతా ఇచ్చిన గొప్ప గిఫ్ట్ నువ్వే.. అసలు విషయం చెప్పేసిన రకుల్ ప్రీత్ సింగ్
హీరోయిన్ గా పరిచయం అయిన తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. వరుస ఆఫర్లతో టాలీవుడ్ లో అప్పటి బ్యూటీస్ కి గట్టిపోటీ ఇచ్చింది.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. వేంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. హీరోయిన్ గా పరిచయం అయిన తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. వరుస ఆఫర్లతో టాలీవుడ్ లో అప్పటి బ్యూటీస్ కి గట్టిపోటీ ఇచ్చింది. ఇక వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. అలాగే స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంది. దాదాపు అందరు టాప్ హీరోలతో జతకట్టింది రకుల్ ప్రీత్. ఇక ఇటీవల కాలంలో రకుల్ జోరు తగ్గిందనే చెప్పాలి. ఈ అమ్మడుకు తెలుగుతో పాటు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి అలరించింది. ఇక ఇప్పుడు తెలుగులో మాత్రం తక్కువ సినిమాలు చేస్తోంది.
కాగా రకుల్ చివరిసారిగా తెలుగులో కొండపొలం సినిమాలో కనిపించింది. ఇక హిందీలో థాండ్ గాడ్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె నటించిన ఛత్రివాలి సినిమా కోసం వెయిట్ చేస్తుంది. ఇదే కాకుండా ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు భారీ బడ్జెట్ తమిళ్ సినిమాలున్నాయి. అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబోలో రాబోతున్న ఇండియన్ 2 సినిమాలోనూ నటిస్తోంది.




ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రకుల్. రోజూ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది. అలాగే ఈ అమ్మడు త్వరలో పెళ్లిపీటలెక్కనుందని చాలా కాలం గా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రకుల్, జాకీ భగ్నానీ తో ప్రేమలో ఉందని వార్తలు వినిపించాయి. ఆ వార్తలు నిజం చేస్తూ ఈ ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి ప్రియుడితో ఉన్న ఫోటోను షేర్ చేసింది రకుల్. శాంటా నాకు జీవితంలో గొప్ప బహుమతినిఇచ్చాడు అది నువ్వే.. సంతోషంఐలవ్మీ యూ బేబీ.. మీరు కోరుకున్నవన్నీ మీరుసాదించాలని కోరుకుంటున్నాను .. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. అంటూ క్రిస్మస్ సందర్భంగా ప్రియుడు ఫోటోను శషేర్ చేసింది రకుల్. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




