Allu Arjun: అల్లు అర్జున్‌ ఇంట్లో రక్షా బంధన్‌.. అన్నయ్యకి రాఖీ కట్టిన అల్లు అర్హ.. ఫొటోస్‌ చూశారా?

|

Aug 31, 2023 | 11:42 AM

అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతిరూపం రక్షా బంధన్‌. ఏ కష్టమొచ్చినా నీకు నేను, నాకు నువ్వు తోడుగా ఉంటామంటూ తోబుట్టువులతో కలసి ఎంతో ఘనంగా ఈ పండగను సెలబ్రేట్‌ చేసుకుంటారు. సెలబ్రిటీలు సైతం తమ సోదరులకు రాఖీ కట్టి సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికైన అల్లు అర్జున్‌ ఇంట్లో రక్షా బంధన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి.

Allu Arjun: అల్లు అర్జున్‌ ఇంట్లో రక్షా బంధన్‌.. అన్నయ్యకి రాఖీ కట్టిన అల్లు అర్హ.. ఫొటోస్‌ చూశారా?
Allu Arjun Family
Follow us on

అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతిరూపం రక్షా బంధన్‌. ఏ కష్టమొచ్చినా నీకు నేను, నాకు నువ్వు తోడుగా ఉంటామంటూ తోబుట్టువులతో కలసి ఎంతో ఘనంగా ఈ పండగను సెలబ్రేట్‌ చేసుకుంటారు. సెలబ్రిటీలు సైతం తమ సోదరులకు రాఖీ కట్టి సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికైన అల్లు అర్జున్‌ ఇంట్లో రక్షా బంధన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. బన్నీ గారాల పట్టి అల్లు అర్హ, తన అన్నయ్య అయాన్‌కు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించింది. అనంతరం అయాన్‌.. తన క్యూట్ చెల్లికి బహమతులు ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలను అల్లు స్నేహా రెడ్డి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారాయి. ‘అన్నా చెల్లెళ్ల అనుబంధమంటే ఇదే’, ‘సో క్యూట్‌’ అంటూ అభిమానులు, నెటిజన్లు, ఫాలోవర్లు కామెంట్లు పెడుతున్నారు. అలాగే తమ ఇంట్లో జరిగిన రక్షాబంధన్‌ వేడుకల ముచ్చట్లను పంచుకుంటున్నారు. వీరితో పాటు బుట్ట బొమ్మ పూజా హెగ్డే, స్టార్ యాంకర్‌, శ్రీముఖి, పరిణీతి చోప్రా, సారా అలీఖాన్‌ తదితర సినీ ప్రముఖుల ఇంట్లోను రక్షా బంధన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తమ సోదరులకు రాఖీలు కట్టి దీవెనలు తీసుకున్నారు.

కాగా పుష్ప సినిమాలో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు అల్లు అర్జున్‌. సుకుమార్‌ తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడీ బ్లాక్‌ బస్టర్‌ సినిమాకు సీక్వెల్‌ రానుంది. పుష్ప 2 ..ది రూల్‌ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా అల్లు అర్జున్‌ రిలీజ్‌ చేషిన షూటింగ్‌ వీడియో సైతం పుష్ప సీక్వెల్‌పై అంచనాలను అమాంతం పెంచేసింది. పుష్ప సినిమాకు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికైన దేవిశ్రీ ప్రసాదే పుష్ప 2కు స్వరాలు అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్‌ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ ఇంట్లో రక్షా బంధన్ సెలబ్రేషన్స్..

 

శ్రీముఖి ఇంట్లో

పూజా హెగ్డే రాఖీ సెలబ్రేషన్స్

సారా అలీఖాన్ ఇంట్లో .. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..