Megastar Chiranjeevi: చిరంజీవి వాచ్ అన్ని కోట్లుంటుందా ?.. నెట్టింట వైరలవుతున్న మెగాస్టార్ రాఖీ ఫోటోస్..

|

Sep 01, 2023 | 4:31 PM

ఆగస్ట్ 31 రక్షాబంధన్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఇటు సెలబ్రెటీస్ సైతం తమ సోదరులకు రాఖీ కట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోనూ రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. చిరు చెల్లెల్లు ఆయన ఇంట్లో మెగా బ్రదర్స్ కు రాఖీ కట్టి అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిరు తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

Megastar Chiranjeevi: చిరంజీవి వాచ్ అన్ని కోట్లుంటుందా ?.. నెట్టింట వైరలవుతున్న మెగాస్టార్ రాఖీ ఫోటోస్..
Megastar Chiranjeevi
Follow us on

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే భోళా శంకర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. డైరెక్టర్ మెహర్ రమేశ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై చిరు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఆగస్ట్ 31 రక్షాబంధన్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఇటు సెలబ్రెటీస్ సైతం తమ సోదరులకు రాఖీ కట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోనూ రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. చిరు చెల్లెల్లు ఆయన ఇంట్లో మెగా బ్రదర్స్ కు రాఖీ కట్టి అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిరు తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

అయితే చిరు షేర్ చేసిన ఆ వీడియో క్షణాల్లో వైరలయ్యింది. తన ఇంట్లోని పూజ గదిలో తనకు జన్మనిచ్చిన తండ్రి వెంకటరావు, మామయ్య అల్లు రామలింగయ్య ఫోటోలను పెట్టి దేవుళ్లతో సమానంగా పూజిస్తున్నారు చిరంజీవి. ఇది గమనించిన అభిమానులు చిత్రపరిశ్రమలో ఎందరికో స్పూర్తి అయిన మెగాస్టార్ ఎప్పటికీ మూలాలను మర్చిపోరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇవే కాకుండా చిరు షేర్ చేసిన వీడియోలో మరొకటి నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే.. చిరు చేతికి ఉన్న వాచ్. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న చిరు ఎడమ చేతికి రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్ వాచ్ ధరించారు. అత్యధిక విలువైన ఈ వాచ్ ధర ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ఇంకేముంది వాచ్ ధర కోసం నెట్టింట సెర్చ్ స్టార్ట్ చేశారు నెటిజన్స్. చిరు దరించిన వాచ్ ధర రూ.2.35 లక్షల డాలర్లు అని ఉంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే సుమారు. రూ.2 కోట్లు. ఇక ఈ వాచ్ ధర తెలిసి షాకవుతున్నారు .

గతంలో బేబీ సినిమా సెలబ్రెషన్స్ ఈవెంట్‏లోనూ చిరంజీవి ధరించిన వాచ్ స్పెషల్ అట్రాక్షన్ అయిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో చిరు రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. దాని ధర 23,000 డాలర్స్. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.1.89 కోట్లు. నిజానికి చిరుకు కొత్త కార్లు, వాచ్ కలెక్షన్స్ అంటే చాలా ఇష్టమట. ఇదే విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు చిరు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.