Rajinikanth: దేవుడురా మా అన్నా! రజనీకాంత్ ఫొటోలతో బొమ్మల కొలువు.. ఘనంగా నవరాత్రి పూజలు.. వీడియో

సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోలను దేవుళ్లలా పూజించే అభిమానులు చాలా మంది ఉన్నారు. హీరోయిన్ల కోసం గుడి కట్టిన వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ పై అభిమానంతో మధురైలో ఒక వీరాభిమాని ఒక గుడి నిర్మించాడు. ఇప్పుడు ఆ గుడిలో రజనీ ఫొటోలతో బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేశాడు.

Rajinikanth: దేవుడురా మా అన్నా! రజనీకాంత్ ఫొటోలతో బొమ్మల కొలువు.. ఘనంగా నవరాత్రి పూజలు.. వీడియో
Rajinikanth

Updated on: Sep 21, 2025 | 11:08 AM

సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ విదేశాల్లోనూ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తమిళనాడులో చాలా మంది రజనీని దేవుడిలా ఆరాధిస్తారు. గుడులు, విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలు కూడా నిర్వహిస్తారు. మధురైకి చెందిన కార్తీక్ అనే యువకుడు సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు మీద గుడి కట్టాడు. అక్కడ 250 కేజీల రజనీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. దానితో పాటు అతని తల్లిదండ్రుల ఫోటో , వినాయకుడి ఫోటో ఏర్పాటు చేసి ప్రతిరోజూ దీపం వెలిగించి, రజనీ విగ్రహానికి పూజలు కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రజనీకాంత్ ఫొటోలు, పోస్టర్లతో బొమ్మల కొలువు ఏర్పాటు చేశాడు. రజనీ నటించిన వివిధ సినిమాల్లోని స్టిల్స్ తో పాటు శివుడు, కృష్ణుడు మొదలైన దేవుళ్ల రూపంలోనూ రజనీ ఫొటోలు, పోస్టర్లను ఈ బొమ్మల కొలువులో ఏర్పాటు చేయడం విశేషం. రజనీకాంత్ విగ్రహంతో పాటు ఫొటోలు, పోస్టర్లకు అభిమాని పూజలు చేస్తోన్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. కార్తీక్ భక్తిని చూసి అందరూ ఆశ్చర్యూపోతున్నారు.

“ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల కోసం రజనీకాంత్ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం 15 దశల్లో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నాం. మొదటి 10 దశల్లో రజనీకాంత్ ఉత్తమ ఫోటోలను ఉంచి పూజలు చేస్తాం. మేము రజనీ సార్ ను దేవుడిగా చూస్తాం. అందుకే శివుడు, కృష్ణుడి వేషంలో ఆయన బొమ్మలను ఉంచాం’ అని సదరు అభిమాని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

రజనీకాంత్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు.. వీడియో..

రజనీకాంత్ వయసు ఇప్పుడు సుమారు 74 సంవత్సరాలు. ఈ వయసులోనూ ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు. కుర్ర హీరోలకు పోటీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. ఇటీవల రజనీ నటించిన ‘కూలీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లోకేశ్ కనరాజ్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ గా నిలిచింది. త్వరలోనే ‘జైలర్ 2’ సినిమా కూడా విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.